Big Stories

Obesity: మీరు బరువు ఎందుకు పెరుగుతున్నారో తెలుసా? ఈ తప్పులు చేస్తున్నట్లే మరి

obesity
obesity

Obesity: ఒబెసిటీ(అధిక బరువు) అనేది ప్రస్తుతం అందరి జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. అయితే చాలా మంది దీనికి కారణాలు వెతుకుతుంటారు. కానీ ఆహారం ఎక్కువగా తీసుకోవడం లేదా టైంకి తినకపోవడం మాత్రమే అధిక బరువుకు కారణం అని అనుకుంటుంటారు. కానీ మారుతున్న జీవనశైలి అనేది అధిక బరువుకు ముఖ్య కారణం అని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లే దీనికి ముఖ్య కారణం అని అంటున్నారు. మనం తీసుకునే ఆహారంలో అనారోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతుంటాయట. ఇందులో చాలా రకాల కారణాలు అధిక బరువుకు కారణం అవుతున్నాయని అంటున్నారు.

- Advertisement -

నిద్రలేమి :

- Advertisement -

స్మార్ట్ ఫోన్లు వచ్చాక అసలు ఫోన్ తప్ప మరో ప్రపంచం లేకుండా పోతుంది. పిల్లల నుంచి ముసలి వారి వరకు ఫోన్లలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి వరకు నిద్ర మానేసి మరి ఫోన్లు చూస్తుంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందట. దీని వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుందట. దీని కారణంగా అధిక క్యాలరీలు ఉండే ఫుడ్ తీసుకుని అనారోగ్యం బారిన పడతారట. ఇందువల్లే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల ప్రతీ రోజు 8 గంటల పాటు నిద్రపోవడం మంచిదని సూచిస్తున్నారు.

Also Read: డైటింగ్ పేరుతో అన్నం తినడం మానేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?

క్యాలరీ ఫుడ్ :

కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగులకు వర్క్ ప్రెషర్ పెరిగిపోయింది. వర్క్ ప్రెషర్ వల్ల తాము తీసుకునే ఫుడ్‌పై ప్రభావం పడుతుంది. తరచూ పిజ్జా, చికెన్ సంబంధిత ఆహారం, పాస్తా, నూడిల్స్, బర్గర్లు, శాండివిచ్ లు వంటివి తీసుకోవడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆహార పదార్థాల్లో వీటిని దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వర్కౌట్ :

చాలా మంది కి వర్క్ ప్రెషర్ వల్ల వ్యాయామాలు చేయడానికి సమయం దొరకడం లేదు. కానీ తరచూ వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా బరువు పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఉండే కొవ్వును కరిగించడానికి ప్రతీ రోజు వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News