BigTV English

Tips For Glowing Face: ఇలా చేస్తే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది

Tips For Glowing Face: ఇలా చేస్తే మేకప్ లేకుండానే మీ ముఖం మెరిసిపోతుంది

Tips For Glowing Face: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అందంకోసం అమ్మాయిలు రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా తమ అందాన్ని పెంచుకోవడానికి ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ కొన్నిసార్లు ఈ ఉత్పత్తులు ఎక్కువగా వాడడం వల్ల చర్మం మెరిసిపోవడం ప్రక్కన పెడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి.


చర్మానికి తరుచుగా మేకప్ వాడకుండా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఫేస్ ప్రొడక్ట్స్, మేకప్ వాడకుండా అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవాలంటే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని అంటున్నారు. మేకప్ లేకుండా అందంగా కనిపించేలా చేయడానికి కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. ఈ చిట్కాలు వల్ల సహజంగానే అందంగా కనిపించవచ్చు.

సరైన ఫేస్ మాస్క్:
చర్మ రకాన్ని బట్టి ఫేస్ మాస్కులు, మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మీకు కావాలంటే ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ మాస్కులను ఉపయోగించండి. వీటి వల్ల మీ చర్మం మెరుస్తుంది. అంతేకాకుండా ముఖంపైన ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. హొం మేడ్ ఫేస్ మాస్క్ ల వల్ల చర్మం సహజంగా అందంగా కనిపిస్తుంది.


శుభ్రత పట్ల జాగ్రత్త అవసరం:
ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలంటే ముఖంపై ఉన్న జిడ్డును తొలగించాలి. అప్పుడే చర్మం గ్లో గా కనిపిస్తుంది. ముఖం జిడ్డుగా ఉన్నప్పుడు తప్పనిసరిగా తరచుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అనవసరం. కనీసం రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు, దుమ్ము, దూళి కణాలు తొలగిపోతాయి. ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.

మాయిశ్చరైజర్:
ఏ కాలంలో అయినా సరే ముఖానికి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. మాయిశ్చరైజర్ ఉపయోగించకపోతే చర్మం పొడి బారడం మొదలవుతుంది. దీని వల్ల ముఖంలో లోపల నుంచి పాడవుతుంది. అటువంటి పరిస్థితులు మీ చర్మంపై రాకుండా ఉండాలంటే చర్మం రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఉపయోగించడం చాలా అవసరం. దీని వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఫలితంగా అందంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది.

ఎక్సో ఫోలియేట్:

ముఖాన్ని ఎప్పటికప్పుడు ఎక్సో ఫోలియేట్ చేయడం చాలా అవసరం. దీనివల్ల చర్మం లోపల నుంచి జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా ముఖం మెరుస్తూ కనిపిస్తుంది .చర్మాన్ని ఎక్స్పోజిట్ చేయకపోతే జిడ్డు పేరుకుపోతుంది. దీని వల్ల మొటిమలు వచ్చే అవకావాలు ఎక్కువగా ఉంటుంది. అందుకే తప్పకుండా చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఎక్స్పోలియేట్ చేయడం చాలా అవసరం.

Also Read: ఐస్ వాటర్‌తో మొటిమలకు చెక్ !

మేకప్‌కు దూరంగా ఉండండి:
చర్మం మెరుస్తూ ఉండాలని కోరుకోవడం కామన్. మేకప్ లేకుండానే మీ ముఖం మెరుస్తూ ఉండాలని అనుకుంటే మాత్రం సహజమైన పదార్థాలతో తయారు చేసిన ఫేస్ వాష్లను ఉపయోగించడం మంచిది . కెమికల్ ఫేస్ వాష్ లను అస్సలు ఉపయోగించకూడదు. ఇవి మీ ముఖాన్ని పాడు చేస్తాయి. అంతే కాకుండా అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Food: ఖాళీ కడపుతో.. పొరపాటున కూడా ఇవి తినొద్దు తెలుసా ?

Cancer Risk: వంటగదిలో ఉన్న ఈ ఆహార పదార్థాలతో.. క్యాన్సర్‌కు చెక్

Ritika Nayak: జోరు పెంచిన మిరాయ్ బ్యూటీ.. ఘనంగా స్టోర్ లాంఛ్

Hand Dryer: పరిశుభ్రత పేరుతో అనారోగ్యం.. వామ్మో ఇంత డేంజరా ?

Diabetes health Tips: డయాబెటిస్‌కు సులువైన పరిష్కారం.. ఈ పండు ఆకు నీటిని తాగితే చాలు!

Walking: డైలీ 20 నిమిషాలు నడిస్తే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Food and Age: ఇలాంటి ఫుడ్ తింటే.. త్వరగా ముసలి వాళ్లవుతారట !

Food For Better Digestion: భోజనం చేసాక ఇవి తింటే.. జీర్ణ సమస్యలు దూరం

Big Stories

×