BigTV English

Kangana’s Emergency: ఎమర్జెన్సీ తెలంగాణలో బ్యాన్ దిశగా రేవంత్ కీలక నిర్ణయం?

Kangana’s Emergency: ఎమర్జెన్సీ తెలంగాణలో బ్యాన్ దిశగా రేవంత్ కీలక నిర్ణయం?

Kangana’s Emergency could face ban in Telangana..as Sikh delegation raises concerns : కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించిన ఎమర్జెన్సీ మూవీ త్వరలో దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ మూవీకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా పెండింగ్ లో ఉంచింది సెన్సార్ పూర్తిగా ఇవ్వకుండా..అయితే సెన్సార్ అధికారులకు కొందరి నుంచి రాజకీయ బెదిరింపులు వస్తున్నాయని..అందుకే సెన్సార్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని కంగనా కామెంట్ చేశారు. విడుదలకు ముందే ఎమర్జెన్సీ చాలా వివాదాలను ఎదుర్కుంటోంది. మరో పక్క పంజాబ్ సిక్కు సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపేస్తామని..ట్రైలర్ లో సిక్కులను దేశద్రోహులుగా చూపించారని గొడవ చేస్తున్నారు .ఇప్పటికే ఈ విషయంపై కొందరు కోర్టుకు సైతం వెళ్లారు. ఈ మూవీకి దర్శకత్వం కూడా కంగనానే చేశారు.


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కీలక నిర్ణయం

ఎమర్జెన్సీ మూవీపై కంగన చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ మూవీని విడుదల చేయకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందిరాగాంధీని ఈ మూవీలో బ్యాడ్ గా చిత్రీకరించారని..ఆమె క్యారెక్టర్ ను విలన్ గా చూపించారని కాంగ్రెస్ వాదులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం కలిసి రాష్ట్రంలో ఎమర్జెన్సీ మూవీ విడుదలను అడ్డుకోవాలని సూచించినట్లు సమాచారం. దాదాపు 18 మందితో కూడిన సిక్కు ప్రతినిధుల సంఘం ఇచ్చిన ఫిర్యాదును తప్పక తాము పరిశీలిస్తామని వారికి షబ్బీర్ అలి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు చెందిన కొందరు సీనియర్ మంత్రులు కూడా రేవంత్ రెడ్డి వద్ద ఎమర్జెన్సీ విడుదలను ఆపేయాలని..అధిష్టానం కూడా ఎమర్జెన్సీ మూవీ పై కోపంగా ఉందని..సూచించడంతో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని సమాచారం.


ట్రైలర్ పై అభ్యంతరాలు

దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అత్యంత దారుణ పరిణామం ఎమర్జెన్సీ. 1975 నుంచి దాదాపు రెండేళ్ల పాటు దేశ ప్రజలకు నరకం చూపారు. ఈ సమయంలోనే ఇందిరాగాంధీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లందిరీన జైళ్లలో పెట్టారని ..వారిపై ఎలాంటి నేరారోపణలు లేకపోయినా ఎమర్జెన్సీ రూల్స్ ప్రకారం వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి జైళ్లలో పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పైగా ఇందిరాగాంధీ ప్రియపుత్రుడు సంజయ్ గాంధీ బలవంతంగా సంతాన నిరోధక ఇంజెక్షన్లు మహిళలకు ఇప్పించారని..సంజయ్ ఆగడాలకు పరాకాష్ట ఎమర్జెన్సీ అని అంతా అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కంగనా రనౌత్ కూడా ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. దీనితో కాంగ్రెస్ వర్గాలు మొదటినుంచి ఈ సినిమాను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ లోనూ ఇందిరాగాంధీని దాదాపు విలన్ కింద చూపించారు. ఇదంతా బీజేపీ వెనక ఉండి ఆడిస్తున్న డ్రామా అని కాంగ్రెస్ వాదులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే ఈ సినిమాను విడుదల కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. తనకి కూడా చాలా బెదిరింపులు వచ్చాయని కంగనా రనౌత్ తెలిపారు. అయితే ఈ మూవీలో కేవలం వాస్తవాలు మాత్రమే చూపించామని..కంగనా అంటున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×