Weight Loss Tips: నేడు పెరిగిన బరువుతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. ఊబకాయం అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది. మారుతున్న జీవనశైలితో పాటు, చెడు ఆహారపు అలవాట్లు కూడా ఊబకాయానికి కారణమవుతాయి. అధిక బరువుతో మీరు ఆందోళన చెందుతుంటే కనక మీ అలవాట్లలోనే కొన్నింటిని మార్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు.
బరువు పెరగడం వల్ల హై బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. అందుకు బరువు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఈజీగా బరువు తగ్గించేందుకు సహాయపడే కొన్ని విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి 5 మార్గాలు..
ఆరోగ్యకరమైన ఆహారం:
బరువు తగ్గడానికి అత్యంత ముఖ్యమైంది.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. సంతృప్త, అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి.
రెగ్యులర్ వ్యాయామం:
బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రోజుకు 30 నిమిషాల పాటు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఒక వేళ మీకు యోగా, డ్యాన్సింగ్ ,క్రీడల వంటివి ఇష్టం ఉంటే కనక వీటిని కూడా చేయవచ్చు. ఫలితంగా 30 రోజుల్లోనే ఈజీగా బరువు తగ్గుతారు.
అధిక క్యాలరీలకు దూరంగా ఉండాలి:
బరువు తగ్గాలని అనుకునే వారు అధిక క్యాలరీలు ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. అంతే కాకుండా శారీరక శ్రమ ద్వారా మీ శరీరంలోని కేలరీలను తగ్గించవచ్చు. అంతే కాకుండా జంక్ ఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. ఇది కూడా బరువు పెరగడానికి కారణం అవుతుందని గుర్తుంచుకోండి.
తగినంత నిద్ర:
శరీరానికి తగినంత నిద్ర లేకపోతే కూడా బరువు పెరుగుతారు. ప్రతి రోజు రాత్రి 7-8 గంటలు నిద్ర పొందడం చాలా ముఖ్యం. తగినంత నిద్ర ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గించండి:
ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి.
Also Read: ఈజీగా బరువు తగ్గించే డ్రింక్ ఇదే !
ఇతర ముఖ్యమైన చిట్కాలు..
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.