EPAPER

Harish Rao Dominate KCR: హరీష్ డామినేషన్..కేటీఆర్ సైడ్.. కేసీఆర్‌కు ఝలక్

Harish Rao Dominate KCR: హరీష్ డామినేషన్..కేటీఆర్ సైడ్.. కేసీఆర్‌కు ఝలక్

Harish Rao Dominate KCR: గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబరు టూగా కేటీఆర్ చక్రం తిప్పారు. నెక్స్ట్ సీఎంగా పార్టీ నేతలు ఆయన్ని ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తన తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు మామ చాటు అల్లుడిలా ఆయన అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వచ్చిన హరీష్‌రావు.. ఇప్పుడు చక్రం తిప్పడం మొదలుపెట్టారా? పార్టీపై గ్రిప్ కోసం స్పీడ్ పెంచుతున్నారా? వ్యూహత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేటీఆర్‌కి చెక్ పెడుతున్నారా?


పదేళ్లు పవర్‌లో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో సర్వం కేసీఆరే అన్నట్లు వ్యవహారం నడిచింది. అధికారం కోల్పోయాక పార్టీపై కేసీఆర్ పార్టీపై కూడా పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతోంది. అందుకు తాజాగా జరుగుతున్న పరిణాయాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆఆర్ మౌనముని అవతారమెత్తారు. బడ్జెట్ రోజు ఒక్కసారి అసెంబ్లీకి హాజరై మళ్లీ అటు వైపు చూడలేదు వరదలు వచ్చి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నా కనీసం నోరెత్త లేదు.. ఎమ్మెల్యేలు, నేతలు పార్టీ వదిలిపోతున్నా స్పందించడం లేదు. మధ్యమధ్యలో పూజలు, యాగాలు చేసుకుంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు.

కేసీఆర్ లేని గ్యాప్ పూడుస్తూ హరీష్ రావు అప్రకటిత ప్రతిపక్ష నాయకుడి అవతారం ఎత్తారు. దూకుడు ప్రదర్శించడంలో కాని, వాగ్దాటిలో కాని హరీష్‌రావు తో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెపుతుంటారు. మీడియా సమావేశాలు. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యక్స్ లో పోస్ట్ లు చేయడం లాంటి వాటి వరకు కేటీఆర్ ఒకే కాని.. వీధి పోరాటాలు అంటే మాత్రం కేటీఆర్‌తో కాని పని అని గులాబీ క్యాడర్ బహిరంగంగానే చెప్తుంది. ఆ విషయంలో హరీష్‌రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవం.


ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని వెనకేస్తూ.. అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయాలని తాజాగా రోడ్డెక్కారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం ముందు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో ధర్నాకు దిగి అరెస్ట్ అయ్యారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి కేసులో నలభైమందిపై కేసు నమోదు చేశామని సీపీ చెప్పినప్పటికీ హరీష్‌రావు నిరసనకు దిగి హడావుడి చేశారు. కేసీఆర్ లైమ్‌లైట్‌లో లేకపోవడంతో అప్పటి నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.

Also Read: కేటీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిందెవరు?

అలా తనదైన దూకుడుతో క్యాడర్‌తో భేష్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అపర చాణక్యుడు అయిన కేసీఆర్ఆర్ ఇదంతా గమనించకుండా ఉంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ అంటే అందరూ భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్టీ వారే అంటున్నారు. భవిష్యత్తులో హరీష్ రావు ప్రమాదాన్ని గుర్తించే రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆయనకి మొదట్లో మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టారంటారు.

ఈటల రాజేందర్‌నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశాక హరీష్ రావును కేసీఆర్ దగ్గరికి తీశారు. లేదంటే పరోక్షంగా ఈటలతో చేతులు కలిపే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించడమే కాకుండా …. తెలివిగా ఉప ఎన్నికలలో ఈటలను ఓడించే బాధ్యత కూడా హరీష్ భుజాలపై పెట్టారన్న వాదన ఉంది. అయితే ఇప్పుడు హరీష్‌రావు ను కంట్రోల్ చేయగలిగిన స్థితిలో కేసీఆర్ లేరన్నది గులాబీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రోడ్ల పైకి వచ్చి పోరాటాలు చేసే పరిస్థితి లేదంటున్నారు.

పదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయన తిరిగి పోరుబాట పట్టలేరని. ప్రస్తుతుమున్న పరిస్థితుల్లో వయస్సు, ఆరోగ్యం కూడా కేసీఆర్‌కు సహకరించన్న సంగతి హరీష్‌రావుకి తెలియని సంగతి కాదంటున్నారు. అటు కేటీఆర్‌ను చూస్తే కేసీఆర్ తరహాలో రాజకీయం చేయలేరు. తండ్రి స్టైల్లో దూకుడు ప్రదర్శించలేరన్న టాక్ ఉంది. అందుకే ప్రతిపక్షంలో ఉండే ఈ అయిదేళ్లు అటు క్యాడర్ ఇటు ప్రజలలో తన ఇమేజ్‌ మరింతపెంచుకునే దిశగా హరీష్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు.. అంతకు ముందు ఉద్యమ సమయంలో మీడియా సమావేశాలు పెట్టాలంటే కేసీఆర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. మంత్రులు సైతం కేసీఆర్ అంటే భయపడే పరిస్థితులు ఉండేవి.. కాని అధికారం కోల్పోయాక ఆ పరిస్థితి కనపడడం లేదు. బావబామ్మరుదులైన కేటీఆర్ , హరీష్‌రావు ల మధ్య పార్టీలో వారసత్వ పోటీ ఉండడం సహజమే .. అయితే వారి మధ్య ఉన్న పోటీని అడ్డం పెట్టుకొని కొందరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం సొంత అజెండా నడిపిస్తున్నారు. తాజాగా నడుస్తున్న కౌశిక్ రెడ్డి ఎపిసోడే అందుకు నిదర్శనం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా, మహిళల్ని కించపర్చేలా కౌశిక్ రెడ్డి మాట్లాడినా హరీష్‌రావు ఆయన్ని సపోర్టు చేస్తూ.. పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేశారు. దాంతో కౌశిక్ ఎపిసోడ్ వెనుక హరీష్ పాత్రపై లేనిపోని డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం కరుడుగట్టిన గులాబీ కేడర్ మాత్రం హరీష్ దూకుడుని ప్రశంసిస్తుంది. మరి ఇన్నాళ్లు చిన్నబాస్ అనిపించుకున్న కేటీఆర్.. తన బావ దూకుడుని ఎలా తట్టుకుంటారో చూడాలి.

Related News

FIR on KTR : మూసీపై కేటీఆర్ సంచలన ఆరోపణలు… పోలీసులకు ఫిర్యాదు, కేసు పెట్టింది ఏవరంటే ?

Konda Surekha: మంత్రి కొండా, ఎంపీ రఘునందన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్.. ఒకరు మాజీ సర్పంచ్.. మరొకరు ?

TPCC Chief: గాంధీ భవన్‌లో కీలక మీటింగ్.. ఆ ఆపరేషన్ షురూ!

KTR: ఢిల్లీకి మూటలు పంపడమే మీ పనా..? : కేటీఆర్

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

CM Revanth Reddy : మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

MP Aravind: బీఆర్ఎస్‌కు పట్టిన గతే.. మీకూ పడుతుంది: ఎంపీ అరవింద్

Big Stories

×