Bitter Gourd For Diabetes: కాకర కాయ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడే వారి కాకర కాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులకు కాకరకాయ సర్వ రోగ నివారిణి. కాకర కాయ రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది, కాకర కాయ రసం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కలిగే లాభాల గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లకాయ రసం తాగడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాలు..
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కాకర కాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రతి నలుగురిలో ఒకరు జీర్ణ సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా కాకర కాయ రసాన్ని ఖాళీ కడుపుతో తాడగం వల్ల శరీరంలోని సమస్యలు తొలగిపోయి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు కాకర కాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాకరకాయ రసాన్ని క్రమం తప్పకుండా త్రాగడం వల్ల రక్తంలోని చెక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా కాకర రసంలో హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలోని చెక్కరను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుదల:
కాకరకాయ రసం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కాకర కాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది. కాకరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తినిపెంచుతాయి.
బరువు నియంత్రణ:
పెరిగిన బరువుతో చాలా మంది ఆందోళన చెందుతున్నాయి. అలాంటి వారు కాకర కాయ రసం తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే కాకర కాయ రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కాకర రసం తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.
చర్మానికి మేలు:
కాకర కాయ రసం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాకర కాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి . ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి కాంతివంతగా చేస్తాయి. కాకర కాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది. అంతే కాకుండా దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: ఈ వాటర్ డైలీ ఒక గ్లాస్ తాగితే.. అద్భుతాలు జరుగుతాయ్ !
కాకర రసం ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
పొట్లకాయలు- 2
నీరు- 1
నిమ్మరసం- 1/2 టీస్పూన్
రుచికి తగిన ఉప్పు
కాకర కాయ రసాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా కాకర కాయలను తీసుకుని వాటి రెండు చివర్లను కత్తిరించండి. తరువాత వాటిని నిలువుగా కత్తిరించి విత్తనాలను తీయండి. గింజలు తీసివేసిన తర్వాత కాకర కాయలను చిన్న ముక్కలుగా కోయాలి. ఆ తర్వాత మిక్సీలో కట్ చేసుకున్న కాకర కాయ ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ జ్యూస్‌లో నిమ్మరసం కలపండి. నిమ్మరసం దీని రుచిని మెరుగుపరుస్తుంది . అంతే కాకుండా చేదును తగ్గిస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)