Coconut Oil For Face: ముఖం అందంగా మెరిసిపోతూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం కొంత మంది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. రసాయనాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మానికి హాని కలుగుతుంది . అంతే కాకుండా కోసం డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో ముఖాన్ని సహజంగానే మెరిసేలా చేసుకోవచ్చు.
కొబ్బరి నూనె ముఖ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖానికి కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలు కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుంది. మరి కొబ్బరి నూనెలో ఏ పదార్థాలను కలిపి వాడాలి. వాటిని తయారు చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజు కొబ్బరినూనెలో ఈ మూడు పదార్థాలను కలిపి ముఖానికి రాసుకుంటే మీ సమస్య వీలైనంత త్వరగా దూరమై ముఖం మెరిసిపోవడంతో పాటు మచ్చలు తగ్గుతాయి.
అలోవెరా జెల్:
అలోవెరా చర్మ సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిచ్చి మృదువుగా ఉంచడంలో సహకరిస్తాయి. అలోవెరా జెల్ చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. దీని శీతలీకరణ స్వభావం చర్మపు చికాకులను , వడదెబ్బ నుండి ఉపశమనం చేస్తుంది. కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ వేసి తరుచుగా వాడటం వల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. అలోవెరా జెల్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసినా కూడా ముఖం అందంగా మారుతుంది. దీనిని తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
పసుపు:
పసుపు భారతీయ వంటగదిలో అంతర్భాగం. దీనిని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే కర్కుమిన్‌లో క్రిమినాశక, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పసుపులో కొబ్బరి నూనె కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతే కాకుండా ఇది చర్మాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. పసుపు చర్మాన్ని మెరుగుపరచడానికి, మెరిసేలా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది మీ ముఖం యొక్క లూజ్‌నెస్‌ను కూడా తొలగిస్తుంది.
Also Read: మీగడ ఇలా వాడితే.. అమ్మాయిలే అసూయపడే అందం
గ్లిజరిన్:
ఇది చర్మానికి తేమను అందించి పొడిబారకుండా కాపాడుతుంది. గ్లిజరిన్ చేతులు, కాళ్ళ పగిలిన చర్మాన్ని నయం చేయడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కొబ్బరి నూనెలో గ్లిజరిన్ కలిపి వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు గ్లిజరిన్ లో కొబ్బరి నూనెను కలిపి అప్లై చేయవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.