BigTV English
Advertisement

Diabetes: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

Diabetes: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

Diabetes: ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే ప్రతిరోజూ తినే ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి. రక్తంలో ఎప్పుడూ షుగర్ లెవెల్స్ పెరుగుతాయో అంచనా వేయలేము. డైట్ లో మార్పులు చేసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుకోవచ్చు. కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తినడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి. వీటిని ప్రత్యేకంగా తినాల్సిన అవసరం లేదు. మీరు వండే కూరల్లో భాగం చేసుకుంటే చాలు.


దాల్చిన చెక్క
దాల్చిన చెక్క ముక్కలు లేదా దాల్చిన చెక్క పొడిని ఆహారంలో భాగం చేసుకోండి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఉదయం తాగే పాలల్లో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకొని తాగితే మంచిది. అలాగే టీ గా కాచుకొని తాగినా మంచిదే. ఓట్స్ మీల్స్, స్మూతీల్లో కూడా ఈ దాల్చిన చెక్క పొడిని వేసుకొని తినేందుకు ప్రయత్నించండి.

అల్లం
అల్లాన్ని కూరల్లో వేయడం మర్చిపోవద్దు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. సలాడ్‌లలో ఈ అల్లం తురుమును వేసుకుని తిన్నా మంచిదే, లేదా అల్లం టీని ప్రతిరోజూ తాగితే ఇంకా ఉత్తమం.


పసుపు
ప్రతి తెలుగింటి వంటగదిలో పసుపు కచ్చితంగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది.దీనికి యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. పాలల్లో చిటికెడు పసుపు లేదా కూరల్లో ఒక స్పూను పసుపు వేసుకొని తినడం అలవాటు చేసుకోండి.

Also Read:  30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

మెంతులు
మెంతి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం పేస్టు చేసి పెరుగులో లేదా స్మూతీస్ లో వేసుకొని తింటే ఎంతో మంచిది. ఇది చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిని ప్రతిరోజూ ఉండే కూరల్లో భాగం చేయండి. లేదా సూపులలో వెల్లుల్లి ముక్కలు వేసి కాచి తాగండి. నీటిలో వెల్లుల్లి మరగబెట్టి ఆ నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి. వెల్లుల్లి మంచి రుచి అందించడమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

నిగెల్లా సీడ్స్
మార్కెట్లో నల్లని నిగెల్లా విత్తనాలు అధికంగానే దొరుకుతున్నాయి. ఇవి పెరుగుపైనా లేదా సలాడ్లపైన చల్లుకుని తింటే ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ నిరోధకతను అడ్డుకుంటుంది. కాబట్టి మిగిలిన సీడ్స్ ఎక్కడ దొరికినా కొని తెచ్చుకుంటే ఉత్తమం.

మిరియాలు
మిరియాలలో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మిరియాల పొడిని పాలలో వేసుకొని తాగినా లేదా కూరల్లో కలుపుకుని తిన్నా మేలే జరుగుతుంది. కాకపోతే ప్రతిరోజు మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

లవంగాలు
లవంగాల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని కాపాడే గుణం అధికంగా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెరగనివ్వదు. టీ లో లవంగాలను వేసి మరిగించి తాగితే ఎంతో మంచిది. లేదా నీళ్లల్లో లవంగాలను వేసి ఆ నీళ్లు తాగినా మంచిదే. ఎలాగైనా ఇక్కడ ఇచ్చిన ఆహార పదార్థాలు మీ మినువులో ఉండేట్టు చూసుకోండి.

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×