Big Stories

Holika Dahan 2024: హోలీ దహనంలో ఇలా చేయండి.. ఊహించని సంపద లభిస్తుంది!

Holika Dahan 2024
Holika Dahan 2024

Holika Dahan 2024: కులమత భేదాలు లేకుండా దేశ వ్యాప్తంగా అందరూ కలిసి జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. ఈ ఏడాది మార్చి 25వ తేదీన(సోమవారం) హోలీ పండుగ వచ్చింది. ఈ క్రమంలో హోలీ పండుగను అద్భుతంగా జరుపుకోవాలని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రంగుల అమ్మకాలు, హోలీ కోసం తెల్ల దుస్తులు అమ్మకాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. చిన్న పిల్లల నుండి మొదలుకుని పెద్దవాళ్ల వరకు హోలీ రంగులు చల్లుకుని, నీళ్లతో సంతోషంగా జరుపుకుంటారు.

- Advertisement -

హోలీ పండుగ వచ్చిందంటే తమ జీవితంలో రంగులను పూయిస్తుందని భావిస్తుంటారు. ఈ హోలీ పండుగ నాడు చంద్రగ్రహణంతో పాటు శుభయోగాలు కూడా జరుగుతాయి. అయితే మన సనాతధర్మంలో రంగుల పండుగైన హోలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగను శుభగడియగా భావిస్తారు. అయితే ఈ హోలీ పండుగను ఉత్తర భారత దేశ వాసులు అత్యంత ముఖ్యమైన పండుగలా భావిస్తారు. ఈ తరుణంలో హోలీ ముందు హోలీ దహనాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -

హోలీ దహనాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ‘కామ దహనం’ అని పిలుస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ పండుగ వచ్చిన నేపథ్యంలో ముందు రోజు అంటే మార్చి 24వ తేదీ, ఆదివారం రాత్రి కామ దహనం చేస్తారు. రాత్రి 11:13 నుండి 12:07 నిమిషాల వరకు కామ దహనం నిర్వహించుకోవచ్చని పండితులు ముహుర్తాలను నిర్ణయించారు.

Also Read: Holika Dahan 2024: హోలీకా దహనం.. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూలతలు దూరం..

ఈ వస్తువులు వేస్తే సంపద వరిస్తుంది..

కామ దహనం చేసే సమయంలో ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు వేయడం వల్ల దరిద్రం పోతుందని పెద్దలు చెబుతుంటారు. కామ దహనంలో కలప, ఆవుపేడతో చేసిన పిడకలతో అగ్నిదేవుడికి పూజలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో అగ్నిదేవుడికి కొన్ని వస్తువులు సమర్పించండి. ఎండుకొబ్బరి, తమలపాకు, వక్కలను కామ దహనంలో సమర్పించడం వల్ల డబ్బు కొరత ఉంటే తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు.

దరిద్రం పోతుంది..

అగ్నిదేవుడికి అక్షింతలు సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి.. సంపదను ఇస్తుందని దరిద్రం శాశ్వతంగా తొలగిపోతుందని అంటున్నారు. నెయ్యితో తడిపిన తమలపాకును నైవేద్యంగా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. బార్లీగింజలు, పిండిని నైవేద్యంగా పెట్టడం మూలంగా ఇంట్లో తరచూ జరిగే గొడవలు తొలగిపోతాయి కుటుంబం సంతోషంగా ఉంటుందట. కామ దహనంలో కర్పూరాన్ని సమర్పించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయట.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News