BigTV English

Horse Gram Benefits: ఉలవలను తింటే ఎన్ని లాభాలో తెలుసా.. ఈ సమస్యలన్నీ పరార్..

Horse Gram Benefits: ఉలవలను తింటే ఎన్ని లాభాలో తెలుసా.. ఈ సమస్యలన్నీ పరార్..

Horse Gram Benefits: ఇంట్లో ఉండే కూరగాయలు, గింజలు, పండ్లతో ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షించుకోవచ్చు. ముఖ్యంగా పప్పులు, గింజలను తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వంటివి సోకిన సమయంలోను ఉలువలను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని ఆయుర్వేద చికిత్సలోను వాడుతుంటారు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఉలవలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


ఉలవలు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా రక్షించేందుకు తోడ్పడతాయి. పిల్లలో మానసిక, శారీరక ఎదుగుదలకు కూడా ఇవి తోడ్పడతాయి. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు కూడా ఉలవలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీలోని రాళ్లను కూడా కరిగిస్తాయి. అధికబరువు ఉన్న వారికి కూడా ఉలువలు సహాయపడతాయి. అంతేకాదు రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి.

అధిక కొలస్ట్రాల్ ఉండే క్రమం తప్పకుండా ఉలవలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి. సాధారణంగా ఎక్కిళ్లు వచ్చిన సమయంలోను ఉలవలు తీసుకుంటే వెంటనే ఎక్కిళ్లు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారు వాటి డైట్ లో ఉలవలను చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ను కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. వీటిని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎవరు తీసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మూత్రంలో మంట సమస్యతో పోరాడే వారు కూడా ఉలవలను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.


Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×