Big Stories

Right time for Coconut Water : కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా..?

Coconut Water
Coconut Water

What is the Right time to take Coconut Water: ఎండాకాలంలో ఆహారం తీసుకోవడం కంటే ఎక్కువగా లిక్విడ్స్ (జ్యూస్ లు) తీసుకోవడానికి ఇష్టపడుతుంటాం. ఎందుకంటే వేసవిలో ఎండలో తిరిగి బాడీలోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అంతేకాదు చర్మ కాంతి కూడా పోతుంది. అందువల్ల వేసవిలో ఎక్కువ శాతం నీళ్లు, జ్యూస్ లు తాగడం వంటివి చేస్తుంటాం. అందులోను ముఖ్యంగా కొబ్బరి నీళ్లు శరీరానికి చాలా మంచిదని చెప్పాలి. ఎండలో తిరిగి అలసిపోతే ఒక్క కొబ్బరి బొండం తాగడం వల్ల ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఎండలో తిరిగే వారికి వడ దెబ్బ తగలకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. వేసవిలో ఎండల నుండి బయటపడేందుకు ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్, జ్యూస్ లు వంటివి తీసుకోవడం కంటే కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. అయితే వీటిని ఎప్పుడైనా, ఎలాగైనా తాగొచ్చు. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేవి ఉండవు. కానీ కొబ్బరి నీళ్లను కొన్ని సమయాల్లో తీసుకుంటే మాత్రమే బాగా పనిచేస్తుంది.

- Advertisement -

కొబ్బరి నీళ్లను ఓరల్ సెలైన్ వాటర్ అని కూడా అంటారు. కొబ్బరి నీళ్లు తరచూ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పోషకాలతో కూడా కొబ్బరి నీటిని తాగడానికి కొన్ని సమయాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. కొబ్బరి నీటిని ఓ సమయం లోపు తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయట. ఏ సమయాల్లో తాగినా ఆరోగ్యానికి మంచే జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఉదయం 10 గంటలలోపే కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Also Read: ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి ఆహారం తీసుకెళ్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా?

కొబ్బరి నీళ్లను తరచూ తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కానీ లోబీపీ సమస్యతో బాధపడేవారు మాత్రం కొబ్బరి నీళ్లు తీసుకోకూడదు. కొబ్బరి నీళ్లు బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. అందువల్ల లోబీపీ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల బీపీ మరింత పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ తాగాలని అనుకుంటే మాత్రం డాక్టర్ల సలహాలు తీసుకుని తాగచ్చు. ఇక వాంతులు, విరేచనాల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News