Health Tips: నెయ్యిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో రకాలుగా లాభాలను కలిగిస్తాయి. శరీర పెరుగుదలకు కూడా నెయ్యి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు నెయ్యి తినడం హానికరం. ప్రజలు నెయ్యి తినకుండా ఉండవలసిన ఐదు ప్రధాన ఆరోగ్య సమస్యలను ఇక్కడ చర్చిస్తాము.
నెయ్యి తినడం వల్ల కలిగే నష్టాలు..
నెయ్యిని తిన్నా కూడా దానిని తగిన మోదాదులోనే తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. నెయ్యి వంటి అధిక కొవ్వు పదార్ధాలను తినే మందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యి ఆహారానికి రుచి, అందించడమే కాకుండా శరీరానికి పోషణను అందిస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు నెయ్యి తినడం హానికరం. మరి నెయ్యి ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు:
నెయ్యిలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. నెయ్యి అధిక మొత్తంలో తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు.. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి.
ఊబకాయం ఉన్నవారు:
నెయ్యిలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరుగడానికి కారణమవుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులకు కారణమయ్యే ప్రధాన సమస్య ఊబకాయం. ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు తినే ఆహారంలో నెయ్యిని తగ్గించాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి హానికరం:
మధుమేహ వ్యాధిగ్రస్తులు వారు తినే ఆహారంలో కొవ్వు , కేలరీలు పెరగకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. నెయ్యిలో అధిక మొత్తంలో కొవ్వు, కేలరీలు ఉంటాయి. అదనంగా నెయ్యి తింటే ఇది బరువు పెరగటానికి కారణమవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు నెయ్యికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వారి చక్కెర స్థాయిలను మరింత తగ్గిస్తుంది.
Also Read: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..
జీర్ణ సమస్యలుంటే నెయ్యి తినాలా వద్దా?
నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ కొన్ని పరిస్థితులలో ఇది జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, లేదా అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారికి నెయ్యి ఎక్కువగా తీసుకోవడం హానికరం. నెయ్యిలోని అధిక కొవ్వు పదార్ధం జీర్ణవ్యవస్థను నెమ్మదించేలా చేస్తుంది. ఇది కడుపులో భారం, గ్యాస్ , అజీర్ణానికి దారితీస్తుంది.
కాలేయ సమస్యలు:
ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారు నెయ్యిని జాగ్రత్తగా తీసుకోవాలి. కాలేయం యొక్క ప్రధాన విధి శరీరం నుంచి విషాన్ని తొలగించడం. కొవ్వులను కరిగేలా చేయడం. కాలేయం ఇప్పటికే బలహీనంగా ఉంటే మాత్రం అలాంటి వారు నెయ్యి తీసుకోవడం వల్ల కాలేయం మరింత బలహీనపడుతుంది. ఇది కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.