Big Stories

Bitter Gourd: కాకరకాయ చేదుగా ఉందని తినట్లేదా.. ఈ టిప్స్ పాటిస్తే చేదు ఇట్టే మాయం అవుతుంది

Bitter Gourd: కూరగాయల్లో చాలా మందికి ఏది ఇష్టం లేదు అంటే ఎక్కువగా కాకరకాయ అనే చెప్తారు. అయితే కొంత మంది కాకరకాయను ఇష్టంగా తిన్నా కూడా మరికొంత మందికి మాత్రం కాకరకాయ అంటే అస్సలు నచ్చదు. ఎందుకు అని కారణం అడిగితే కాకరకాయ చేదుగా ఉంటుంది అని సమాధానం చెప్తుంటారు. అయితే కాకరకాయ చేదుగా ఉండడం వల్ల పెద్దల నుంచి మొదలుకుని చిన్న పిల్లల వరకు తినడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాకరకాయ నుంచి శరీరానికి అందే విలువైన పోషకాలను కోల్పోతుంటారు. అయితే కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

కాకరకాయను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు. అయితే కాకరకాయను చేదుగా కాకుండా సరూన పద్ధతిలో వండితే చేదు లేకుండా ఇష్టంగా తింటారట. అయితే కాకరకాయను వండితే చేదు లేకుండా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఇలా చేస్తే చేదు అస్సలు ఉండదు..

కాకరకాయను వండే క్రమంలో ముందుగా దానిపై ఉండే గరుకు భాగాన్ని తొలగించాలి. ఎందుకంటే ఆ గరుకు భాగంలోనే కాకరకాయ చేదు ఉంటుందట. కాకరకాయను కట్ చేసే ముందు గరుకు భాగాన్ని తొలగించి నీటిగా కడిగి కట్ చేసుకోవాలి. అనంతరం కాకరకాయను వండుకుని తినడం వల్ల చేదు లేకుండా ఉంటుంది. అంతేకాదు కాకరకాయను కట్ చేసే సమయంలో అందులో ఉండే గింజలను కూడా తొలగించాలట. ఇలా చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుందట. ఇలా కట్ చేసిన తర్వాత కాకరకాయను ఓ అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టి అనంతరం వండుకోవాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఇలా కాకుండా మరుగుతున్న వేడి నీటిలో కూడా కాకరకాయను వేసి మరిగించి అనంతరం నీటిని వంపేసుకుని వంట చేసుకున్నా కూడా చేదు అనేది తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. చేదు పోవాలంటే కాకరకాయ కూరలో వెల్లుల్లి ఎక్కువగా వేసుకుని వంట చేయాలట. ఇక మరో చిట్కా ఏంటంటే కాకరకాయ కూరలో పెరుగు వేసి వంట చేసినా కూడా చేదు అనేది పూర్తిగా తొలగిపోతుందని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News