BigTV English

Ramadan 2024 : రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండండి!

Ramadan 2024 : రంజాన్ ఉపవాసం.. ఈ ఫుడ్స్‌తో ఎనర్జిటిక్‌గా ఉండండి!
Ramzan 2024
Ramadan 2024

Ramadan Fasting : రంజాన్ మాసం వచ్చేసింది. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో కఠినమైన ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో శరీరం యాక్టివ్‌గా ఉండేందుకు
ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రంజాన్ మాసం ముస్లింలకు ఉపవాస నెల. ఈ నెల మొత్తంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. సూర్యోదయానికి ముందు తినే ఆహారాన్ని సుహూర్ అని సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అంటారు.


ఈ రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాసం నెల రోజుల వరకు ఉంటుంది. ఈ రంజాన్ ఉపవాసాన్ని విరమించే పండుగ ఈద్ అల్-ఫితర్‌గా పిలుస్తారు. ఇదే రంజాన్ పండుగ. ఈ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని నిర్వహించడం ముఖ్యం. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ శక్తే శరీరంలో ఎక్కువకాలం ఉంటుంది.

Also Read :  జుట్టు ఊడటం మొదలైందా?.. ఈ మిస్టేక్స్ చేయకండి!


రంజాన్ ఉపవాసం ప్రారంభించాలంటే కాస్త కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బాగా తిని ఉపావాసం చేయడం వల్ల శరీరానికి సరైన పోషకాలు అందవు. దీని వల్ల విపరీతమైన అలసటకు గురవుతారు. మీరు ఉపవాసానికి ముందు కొన్ని ఆహారాలను తీసుకుంటే ఎనర్జిటిక్‌గా ఉంటారు. అవేంటో ఇప్పుడు చూడండి.

పాలు

ఇఫ్తార్‌కు ముందు పాలు తాగండి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎముకలు ధృడంగా ఉంటాయి. పాలలో బాదం, పిస్తాలను కలుపుకొని తాగితే మరింత పోషకాలు లభిస్తాయి. ఫలితంగా  ఆరోగ్యంగా ఉంటారు.

ఖర్జూరం

ఉపవాసం విరమించే ముందు ఖర్జూరం తీసుకోండి. ఎందుకంటే ఖర్జూరంలో సహజ చక్కెరలు గ్లూకోజ్, సుక్రోజ్‌‌లు ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిగా ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం కండరాల పనితీరుకి అవసరమైన ఎలక్ట్రోలైట్‌ను ఇస్తుంది. అలానే ఖర్జూరంలో నేచులర్ షుగర్స్ ఉంటాయి. ఉపవాస సమయంలో ఖర్జూర పండ్లను ఎక్కువగా తీసుకోండి.

డ్రై ఫ్రూట్స్

జీడిపప్పు, ఎండుద్రాక్ష, ఎండిన ఆప్రికాట్లు తీసుకోండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రంజాన్ ఉపవాస సమయంలో వీటిని తీసుకుంటే మీ శరీరం శక్తిగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు ఆరోగ్యంగా ఉంటుంది.

గింజలు

రంజాన్ ఉపవాస సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. గింజలు మీ ఆహారంలో చేర్చుకోండి. ఇందులో ఆరోగ్యకరమైన ప్రోటీన్లు,ఫైబర్ ఉంటుంది. చియా, గుమ్మడి గింజలు తీసుకోండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో శరీరం చురుకుగా ఉంటుంది.

Also Read : నెయ్యి ఆరోగ్యానికి మంచిదేనా..? గుండె జబ్బులకు దీనికి సంబంధం ఏంటి..?

లడ్డూ

ఉపవాస సమయంలో శక్తివంతంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూని ట్రై చేయండి. ఖర్జూరం, గింజలతో కలిపి లడ్డూ చేసుకొని తినండి. సుహూర్, ఇఫ్తార్ తర్వాత తినండి. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల రోజంతా ఉల్లాసంగా, శక్తి వంతంగా ఉంటారు.

Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ , ఇంటర్నెట్‌లోని సమచారం ఆధారంగా అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా మాత్రమే భావించండి.

Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×