BigTV English

YS Sunitha Reddy : జగన్.. “అంతఃకరణ శుద్ధిగా” అంటే అర్థమేంటో తెలుసా ? : సునీత

YS Sunitha Reddy : జగన్.. “అంతఃకరణ శుద్ధిగా” అంటే అర్థమేంటో తెలుసా ? : సునీత


YS Sunitha Reddy : తోబుట్టువులతో అన్న అని పిలిపించుకున్నవారే.. అయినవారిని హత్యచేసిన హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నేడు వైఎస్ వివేకానందరెడ్డి ఐదవ వర్థంతి సందర్భంగా కడపలో నిర్వహించిన కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ సీఎం వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది.. చిన్నమ్మ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతనే అని పెర్కొన్నారు. సీఎం జగన్ ఇంతలా దిగజారిపోతారని తాను కల్లోకూడా అనుకోలేదన్నారు.

Also Read : వైసీపీలో చేరిన ముద్రగడ.. జగన్ సమక్షంలో పార్టీలోకి కాపు ఉద్యమ నేత..


బాబాయ్ ను చంపింది బంధువులే అని సాక్ష్యాలు ఉన్నా.. బాధితులకు భరోసా ఇవ్వాలన్న కనీస ఆలోచన కూడా సీఎంకు లేదని ఆరోపించారు. పైగా బాధితులపైనే ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఐదేళ్లయినా ఇంతవరకూ అసలైన నిందితులకు శిక్ష పడలేదని, నిందితులకు అధికార పార్టీ కొమ్ముకాస్తోందని అన్నారు. జగనన్నా.. ఒక్కసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని వైఎస్ షర్మిల సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారు ? ఆయన వారసుడిగా మీరేం చేశారు? అని షర్మిల నిలదీశారు.

వైఎస్ వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ పునాదులన్నీ రక్తంతో నిండి ఉన్నాయన్నారు. వివేకా రక్తం, కోడికత్తి రక్తంతో పునాదులు తడిచాయన్నారు. “అంతఃకరణ శుద్ధిగా” అని సీఎంగా ప్రమాణం చేసిన జగన్ కు.. ఆ మాటకు అసలు అర్థమేంటో తెలుసా అని ప్రశ్నించారు. తన తండ్రిని చంపిన నేరస్తులను శిక్షించాలని పోరాడుతున్న తనపై నింద మోపడం అన్యాయమన్నారు. వివేకా హత్యతో సంబంధం ఉంటే.. తనను, తన కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వివేకా మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారని, ఆ తర్వాత ఆయన కాం్రెస్ లోకి మారారన్నారు. వివేకా అన్నమాట జవదాటని తమ్ముడని, చెల్లెళ్లంటే ఆయనకెంతో ప్రాణమన్నారు. కానీ జగన్ మాత్రం.. చెల్లెళ్ల గురించి ఏ మాత్రం ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×