Big Stories

Supreme Court: సీజేఐకి సంచలన లేఖ రాసిన 600 మంది న్యాయవాదులు.. దేనికోసమంటే..?

CJI ChandrachudSupreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు సంచలన లేఖ రాశారు. తమను కొందరు వ్యక్తులు ఒత్తిళ్లకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తమపైన న్యాయ వ్యవస్థ పైనా ఒత్తిడి తెచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

దేశంలో ఎంతో శ్రేష్ఠమైన న్యాయవ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దేశంలోని దాదాపు 600 మంది న్యాయవాదులు సీజేఐ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొందరు వ్యక్తులు పొలిటికల్ అజెండాతో తమ స్వార్థ ప్రయోజనాలు కోసమని న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి.. దాని పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో వారు సీజేఐకి ఫిర్యాదు చేశారు. ఓ వర్గం న్యాయమూర్తులు తమని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారి పేర్లను ఎక్కడా వెల్లడించకుండా ఆరోపణలు చేశారు.

- Advertisement -

కొందరు న్యాయవాదులు రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ వారి కేసులు వాదిస్తున్న వారి తీర్పును ప్రభావితం చేయడానికి ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. తీర్పును వారికి అనుకూలంగా మార్చుకునేందుకు వారు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కొన్ని సార్లు న్యాయమైన తీర్పు వెలువడే అవకాశం ఉండదని తెలిపారు.

రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల విచారించే న్యాయవాదులను వారు టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. కోర్టులపై ప్రజల్లో విశ్వాసం తగ్గించేందుకు వారు తీర్పులపై తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారని వెల్లడించారు. న్యాయవాదులు వారికి అనుకూలమైన తీర్పును వెల్లడించకపోతే.. వెంటనే వారు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: Kejriwal ED Custody : కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపుపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి తీర్పును, న్యాయవాదులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు తీర్పును ప్రభావితం చేసే ఇటువంటి ఒత్తిళ్లను తిప్పకొట్టాలని కోరారు. న్యాయస్థానాలు కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. అయితే ఆ 600 మంది న్యాయవాదులు మార్చి 26న ఈ లేఖ రాసినట్లు సమాచారం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News