Tomato For Face: చలికాలంలో చర్మం నిర్జీవంగా మారుతుంది. అంతే కాకుండా ఈ సీజన్ లో పొడి గాలుల కారణంగా రంగు కూడా మారుతుంది. ఇలాంటి సమయంలోనే తిరిగి చర్మం మునుపటి రంగులోకి మారాలంటే కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటించడం అవసరం. ఇదిలా ఉంటే టమాటో ముఖ సౌందర్యాన్ని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది చర్మం నుండి టానింగ్ తో పాటు మురికి, జిడ్డును కూడా తొలగిస్తుంది. మృత కణాలను తొలగించడంలో కూడా టమాటో చాలా బాగా పనిచేస్తుంది.
టమాటోలో ఉండే విటమిన్ సి , లైకోపీస్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమాటోతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుని వాడాలో ఇప్పుడు తెలుసుకుకుందాం.
1.టమాటో, దోసకాయతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
టమాటో పేస్ట్- 1 టేబుల్ స్పూన్
దోసకాయ పేస్ట్- 1 టేబుల్ స్పూన్
అప్లై చేసే విధానం: ముందుగా పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో వేసుకుని మిక్స్ చేయాలి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రమైన నీటితో ముఖాన్ని వాష్ చేయండి.
2.టమాటో, పసుపుతో ఫేస్ ప్యాక్:
కావాల్సినవి:
టమాటో పేస్ట్- 1 టేబల్ స్పూన్లు
పసుపు- 1 టీ స్పూన్
అప్లై చేసే విధానం: పైన చెప్పిన మోతాదుల్లో టమాటో పేస్ట్‌లో పసుపు కలిపి పేస్ట్ లాగా చేయాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మారుతుంది,
ప్రయోజనాలు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. టమాటోలో యాసిడ్ ఉంటుంది.ఇది చర్మంపై ఉండే ట్యాన్ ను తొలగిస్తుంది. అంతే కాకుండా జిడ్డును పూర్తిగా మాయం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా వాడటం వల్ల ముఖం మెరిసిపోతుంది.
3. టమాటో షుగర్ స్క్రబ్ :
కావాల్సినవి:
టమాటో- 1
షుగర్ – 1 టేబుల్ స్పూన్
అప్లై చేసే విధానం: ముందుగా టమాటోను సగానికి కట్ చేసి దానిపై ఒక చెంచా పంచదార వేసి దానిని ముఖానికి రుద్దండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. దీనిని తరుచుగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం మీరు టమాటోను తరుచుగా వాడటం అలవాటు చేసుకోవడం మంచిది.
Also Read: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. వీటిని మించినది లేదు
ప్రయోజనాలు:
ఈ స్క్రబ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖానికి తాజాదనాన్ని అందిస్తుంది. చక్కెర చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా ఈ స్క్రబ్ ముఖానికి పోషణను అందిస్తుంది. టమాటో స్క్రబ్ ముఖానికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిని తరుచుగా వాడటం వల్ల ముఖం మిలమిలా మెరుస్తుంది. అంతే కాకుండా యవ్వనంగా కనిపించేలా కూడా చేయడంలో టమాటో స్క్రబ్ సహాయపడుతుంది.