Hair Coloring Tips: ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు మనల్ని ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ఇవి జుట్టుకు కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు జుట్టు సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.
ముఖ్యంగా చిన్న వయస్సు నుండే తెల్ల జుట్టుతో సతమతమవుతున్నారు. తెల్ల జుట్టును తొలగించుకోవడానికి చాలా మంది హోం రెమెడీస్ వాడుతుంటారు. ఇవి తెల్ల జుట్టును తక్కువ సమయంలోనే నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా ఇవి జుట్టుకు పోషణను అందిస్తాయి. మరి తెల్ల జుట్టును నల్లగా మార్చే హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెమెడీస్‌లో ఎలాంటి రసాయనాలు ఉపయోగించము . వీటిని వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. హోం రెమెడీస్ జుట్టు మూలాల నుండి నల్లగా చేస్తాయి.
1. ఉసిరి, నిమ్మరసం:
ఉసిరి జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సితో పాటు యాంటీఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. మీరు మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఉసిరితో తయారు చేసిన హోం రెమెడీని వాడవచ్చు.
కావాల్సినవి:
ఒక కప్పు- ఉసిరి రసం
నిమ్మరసం- ఒక చెంచా
పైన చెప్పిన పదార్థాలను బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించి 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టు ను వాష్ చేసుకోవాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తక్కువ సమయంలో తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది.
2. హెన్నా, కాఫీ:
కావాల్సినవి:
హెన్నా- కావాల్సినంత
కాఫీ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
పైన చెప్పిన పదార్థాలను బాగా మిక్స్ చేసి నీళ్లలో కలిపి పేస్ట్ లా చేసి జుట్టుకు అప్లై చేయాలి. దీనిని 1-2 గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును బాగా కడగాలి. ఇది సహజంగా జుట్టును నల్లగా చేస్తుంది. ఎంత తెల్లటి జుట్టుకైనా దీనిని అప్లై చేస్తే తక్కువ సమయంలోనే జుట్టు నల్లగా మారుతుంది.
3. కొబ్బరి నూనె, ఉసిరి పొడి:
కావాల్సినవి:
కొబ్బరి నూనె- 3-4 టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి- తగినంత
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత దీనిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నాన్ చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. బ్లాక్ టీ ,నిమ్మరసం:
కావాల్సినవి:
బ్లాక్ టీ- 1 కప్పు
నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత వీటిని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు తక్కువ సమయంలోనే నల్లగా మారుతుంది.
Also Read: ప్రతి రోజు ఇలా చేస్తే చాలు.. ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్‌గా కనిపిస్తారు
5. హెన్నా, ఉసిరి పొడి:
కావాల్సినవి:
హెన్నా- 4 -5 టేబుల్ స్పూన్లు
ఉసిరి పొడి- 2 టేబుల్ స్పూన్లు
పైన చెప్పిన పదార్థాలను ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత వీటిలో నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది