Nandamuri Balakrishna’s NBK 111 : ఈవెంట్లో బాలకృష్ణ ముందే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్… “బక్కోడికి రజినీకాంత్ ఉంటే.. ఈ బండోడికి బాలయ్య ఉన్నాడు” అంటూ చెప్పిన డైలాగ్ ఫుల్ వైరల్ అయింది. ఇప్పటికే బాలయ్య అభిమానులు థమన్ ఓన్ చేసుకున్నారు. ఈ డైలాగ్ తర్వాత థమన్‌ను పూర్తిగా ఓన్ చేసుకున్నారు బాలయ్య అభిమానులు.
అలాగే బాలయ్యతో సినిమా చేస్తే తనకు ఏం అవుతుందో తనకే తెలీదని, మంచి అలా మ్యూజిక్ కొట్టేస్తాను అని కూడా థమన్ కామెంట్ చేశాడు. అందుకే… బాలయ్య చేసే ప్రతి మూవీకి మ్యూజిక్ కొట్టేది థమనే. అఖండ తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చే ప్రతీ మూవీకి థమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇప్పుడు రాబోయే అఖండ 2 కి కూడా వాయించేది థమనే. అయితేే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… థమన్‌ను బాలయ్య పక్కన పెట్టారట. అది ఏంటో ఇప్పుడు చూద్ధాం…
బాలయ్య నుంచి ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ విడుదలైంది. మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి భారీ నష్టం వచ్చేలా ఉందని ట్రెండ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ వల్ల నిర్మాతకు ఎంత లేదన్న దాదాపు 13.5 కోట్ల మేర నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇది పక్కన పెడితే… బాలయ్య డాకు మహారాజ్ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అటు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటునే, రాబోయే సినిమాలకు కసరత్తులు చేస్తున్నాడు.
బోయపాటి శ్రీనుతో అఖండ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. మహా కుంభమేళను కూడా ఈ సినిమా కోసం యూజ్ చేసుకుంది. కుంభమేళకు వచ్చిన నాగ సాధువులతో సినిమాలోని ఓ కీలక ఘట్టాని షూట్ చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కృష్ణా నది తీరంలో లోకేషన్స్ కోసం సెర్చ్ చేశారు డైరెక్టర్ బోయపాటి. లోకేషన్స్ కన్ఫామ్ చేసుకుని అతి త్వరలోనే తర్వాతి షెడ్యూల్‌ను కూడా స్టార్ట్ చేస్తారు.
ఈ అఖండ 2 తర్వాత బాలయ్య మళ్లీ గోపిచంద్ మలినేనితో చేయబోతున్నారని తెలుస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వీర సింహా రెడ్డి అనే మూవీ వచ్చి హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ కాంబో రిపీట్ కాబోతుంది. NBK 111 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని ప్రకారం… థమన్ ను బాలయ్య పక్కన పెట్టినట్టే అని తెలుస్తుంది. ఈ సినిమా వరకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ని కాకుండా… అనిరుధ్ ను తీసుకుంటున్నాట. దీంతో బక్కోడిని బాలయ్య వదిలేశాడా..? అని చర్చ జరుగుతుంది.
అనిరుధ్ మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రజినీకాంత్ సినిమాలకు అనిరుధ్ బ్లాస్టింగ్ మ్యూజిక్ ఇస్తాడు. దీంతో థమన్ లేడు అని బాధ పడాలా.? లేదా అనిరుధ్ వస్తున్నాడు అనే సంతోషించాలా? అనే పరిస్థితిలో బాలయ్య అభిమానులు ఉన్నారు.
కొంత మంది బాలయ్య డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం… బాలయ్య సినిమాలకు థమనే బెటర్ అని.. అనిరుధ్ కూడా న్యాయం చేయలేడు అని అంటున్నారు.