BigTV English

Side Effects of Energy Drinks : ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారా..!

Side Effects of Energy Drinks : ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తున్నారా..!

Energy Drinks Side Effects : మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. దీనివల్ల మార్కెట్‌లో లభించే వివిధ రకాల డ్రింక్స్ తాగుతున్నారు. అయితే ఎనర్జీ డ్రింక్స్ యువత ఎక్కువగా తాగుతున్నారు. ఈ డ్రింక్స్ తాగితే పెర్ఫార్మెన్స్ పెరుతుందని యాడ్స్‌తో ఊదరకొడుతున్నారు. కానీ ఈ డ్రింక్స్ తాగడం వల్ల శక్తి కాదు కదా.. రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయాని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఎనర్జీ డ్రింక్స్‌లో వాడే రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Read More : కంటి శుక్లాలు ఎందుకు వస్తాయి..?


ఈ రోజుల్లో యువత లైఫ్ చాలా జోష్‌గా ఉంటుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చదువనేది పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అర్థరాత్రి దాటే వరకు చదువులతో, వీకెండ్ పార్టీలతో యువత.. పగలు, రాత్రిళ్లు తేడా లేకుండా గడుపుతున్నారు. సరైన ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఆకలికైనా, దాహానికైనా.. ఎనర్జీ డ్రింక్స్‌తో సరిపెట్టేస్తున్నారు.

అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ యువత భవిష్యత్ ఆరోగ్యం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ మీ రాత్రిని నరకం చేస్తాయట. సరైన నిద్రరాక విలవిల్లాడుతారట. ఈ డ్రింక్స్ తాగడం వల్ల రోగాలను కొనితెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు.

ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్న 18 నుంచి 35 ఏళ్ల వయసున్న 53,000 మంది హెల్త్ డేటాను సేకరించారు. అందులో వారు తీసుకుంటున్న ఎనర్జీ డ్రింక్ క్వాంటిటీ, వారి నిద్ర సమయాన్ని.. ఎనర్జీ డ్రింక్స్ తాగని వారి నిద్ర సమయాన్ని ట్రాక్ చేశారు. పరిశోధనలో వచ్చిన ఫలితాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎనర్జీ డ్రింక్స్ తాగేవారు చాలా తక్కువ సమయం నిద్రిస్తున్నారు. నిద్రకు సంబంధించి ఇతర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.

Read More : ఇవి తిన్నారంటే.. మీ ఇమ్యూనిటీ పైపైకే..!

పరిశోధనల ప్రకారం.. ఎనర్జీ డ్రింక్స్‌లో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లం, చక్కెరల స్థాయి అధికంగా ఉంటుంది. లీటర్‌కు 150 గ్రాముల కెఫిన్ కూడా అదనంగా ఉంటుంది. ఇవి మానశికంగా శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుతాయి గానీ.. వీటితో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ డ్రింక్స్‌ నిద్రను ప్రేరేపించే అడెనోసిన్ అనే రసాయనం పనీతీరుకు అడ్డంకిని కలిగిస్తాయి.

దీని కారణంగా నిద్ర కష్టతరంగా మారుతుంది. నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, మానసిక స్థితి దెబ్బతింటుంది. ఇది మొత్తం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి యువత ఈ ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డ్రింక్స్ తాత్కాలిక శక్తిని మాత్రమే ఇస్తాయని గుర్తుంచుకోండి.

Disclaimer : ఈ కథనం పలు అధ్యయనాలు, వైద్యుల సూచనల మేరకు రూపొందించబడిన సమాచారం మాత్రమే.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×