BigTV English
Advertisement

Protein Shake: నిద్రపోయే ముందు ప్రొటీన్ షేక్ తాగితే ఏమవుతుందో తెలుసుకోండి

Protein Shake: నిద్రపోయే ముందు ప్రొటీన్ షేక్ తాగితే ఏమవుతుందో తెలుసుకోండి

Protein Shake: ప్రోటీన్ షేక్ తాగడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ అందుతుందని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అందుకే వ్యాయామానికి వెళ్లేవారు చేతిలో కచ్చితంగా ప్రోటీన్ షేక్ బాటిల్ ఉంటుంది. అయితే కొంతమంది పడుకునే ముందు కూడా ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.


ప్రొటీన్ షేక్ తాగడం ముఖ్యంగా కండల కోసమే. కండరాల మరమ్మతుకు కూడా ప్రోటీన్ ఎంతో అవసరం. కాబట్టి నిద్రిస్తున్నప్పుడు ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కండరాల మరమ్మత్తు సులువుగా జరుగుతుందని కొంతమంది నమ్మకం. పరిశోధన ప్రకారం నిద్రవేళకు ముందు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రాత్రంతా అందులో ఉండే అమైనో ఆమ్లాలు రక్త స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయని, కండరాల పెరుగుదలకు ప్రోత్సహిస్తాయని తేలింది. అందుకే ఎంతోమంది బాడీ బిల్డర్లు నిద్రవేళకు ముందు ప్రోటీన్ కలిపిన స్మూతీలను తీసుకునేందుకు ఇష్టపడతారు.

అయితే బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం నిద్రకు ముందు ప్రొటీన్ షేక్ తాగడం మంచి పద్ధతి కాదు. మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ పెద్దగా చేయనివారు ఇలా ప్రోటీన్ షేకులను నిద్రపోయే ముందు తాగడం మానుకోవాలని కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే నిద్రలో కూడా అసౌకర్యంగా అనిపిస్తుంది. మత్తుగా నిద్ర పట్టే అవకాశం తగ్గుతుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే పడుకునే ముందు ప్రొటీన్ షేక్ తీసుకోవడం పూర్తిగా మానేయండి. లేకపోతే ఇది అదనపు కేలరీలను శరీరంలో చేరేలా చేస్తుంది. కొందరు వ్యక్తులకు పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ,  పొట్టలో అసౌకర్యం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి.

Also Read: చలికాలంలో పెరుగు తినకూడదా? తింటే ఏమవుతుంది?

క్రీడాకారులు, బాడీ బిల్డర్లు వంటి వారికి మాత్రం ప్రోటీన్ షేక్ నిద్రపోయే ముందు తాగడం వల్ల ఉపయోగం ఉంటుంది. వారు తీవ్రమైన శారీరక శ్రమను చేస్తూ ఉంటారు. అలాంటి వారికి నిద్రపోయే ముందు ప్రొటీన్ షేక్ తీసుకోవడం వల్ల కండరాలు పునరుద్ధరణ జరుగుతుంది. కండరాల పెరుగుదలకు పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మీ పరిస్థితిని బట్టి రాత్రి వేళ ప్రోటీన్ షేక్ తీసుకోవాలా వద్దా నిర్ణయించుకోవాలి. మీరు ప్రతిరోజూ తీవ్రంగా వ్యాయామం చేసేవారైతే రాత్రిపూట ప్రొటీన్ షేక్ తీసుకోవడం అవసరం. నిశ్చల జీవన శైలి కలిగిన వారైతే అంటే ఎక్కువగా శారీరక శ్రమ చేయనివారైతే నిద్రపోయే ముందు ప్రోటీన్ షేక్ చేతులు తీసుకోకుండా నిద్రపోవడమే మంచిది. మీరు బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి.

Tags

Related News

Cracked Heels: మడమల పగుళ్లకు అసలు కారణాలు తెలిస్తే.. షాక్ అవుతారు

Rainbow Puri: రెయిన్‌బో పూరీ..ఇలా తయారు చేసుకుని తింటే అదిరిపోయే టేస్ట్

Kothmira Pachadi: నోరూరించే కొత్తిమీర పచ్చడి.. సింపుల్‌గా ఇలా తయారు చేయండి !

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Big Stories

×