Muscle Strength Food: మన కండరాలు ఎంత బలంగా ఉంటే శరీరం అంత బలంగా మారుతుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే కండరాలు దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. కండరాలను బలంగా మార్చడంలో సరైన జీవనశైలితో పాటు మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. చలికాలంలో కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి.
కండరాలను బలోపేతం చేయడానికి, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కండరాలను నిర్మించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 ఆహారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలను బలోపేతం చేసే 5 ఆహారాలు:
చికెన్:
ఎందుకు తినాలి : చికెన్ బ్రెస్ట్ ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది కండరాలను నిర్మించడానికి అవసరం.
ఎలా తినాలి: దీన్ని గ్రిల్ చేసి, ఉడికించి లేదా కాల్చి తినవచ్చు. దీనిని సలాడ్‌లో కూడా చేర్చుకోవచ్చు.
పెరుగు:
ఎందుకు తినాలి : పెరుగులో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ఎలా తినాలి: మీరు పెరుగును రైస్ లో తినవచ్చు. లేదా పండ్లతో కలిపి స్మూతీని తయారు చేసుకోవచ్చు.
గుడ్లు:
ఎందుకు తినాలి : గుడ్లలో ప్రోటీన్ , ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కండరాల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి.
ఎలా తినాలి: గుడ్లు ఉడకబెట్టడం, వేయించడం లేదా ఆమ్లెట్ తయారు చేసుకొని తినవచ్చు.
పప్పులు:
ఎందుకు తినాలి : పప్పులో ప్రోటీన్, ఫైబర్ , ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి.
ఎలా తినాలి: కర్రీస్, దాల్ రైస్ రూపంలో పప్పును తినవచ్చు.
బ్రోకలీ:
ఎందుకు తినాలి : బ్రోకలీలో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి.
ఎలా తినాలి: బ్రోకలీని ఉడకబెట్టడం. కాల్చడం, సూప్‌లో కలిపి కూడా తినవచ్చు.
తగినంత నిద్ర: నిద్రలో కండరాలు బాగుపడతాయి. అందుకే శరీరానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. 7-8 గంటలు ప్రతి రోజు నిద్రపోయినప్పుడు మాత్రమే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంటాము.
Also Read: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే ఈ ఆయిల్ వాడండి
హైడ్రేషన్: కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. ప్రతి రోజు 2- 3 లీటర్ల నీరు తప్పకుండా త్రాగాలి.
ఓపికపట్టండి: బలమైన కండరాలను నిర్మించడానికి సమయం పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. సమతుల్య ఆహారం కూడా తీసుకోండి. పోషకాహారం మాత్రమే శరీరాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. బాడీకి అవసరమైన శక్తిని అందిస్తుంది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.