Dandruff Home Remedies: జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉంటే మహిళలు మరింత అందంగా కనిపిస్తారు. పొడవైన జుట్టు మహిళల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ చాలా మంది ప్రస్తుతం జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మారుతున్న .జీవనశైలితో పాటు అనేక అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలడం కూడా పెరుగుతోంది. చుండ్రు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. మరి జుట్టు రాలడానికి కారణం అయ్యే చుండ్రును తగ్గించడానికి ఉల్లిపాయ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఉల్లిపాయల రసం చుండ్రు తగ్గడానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. జుట్టు పొడిగా, నిర్జీవంగా మారడం సహజం. జుట్టు రాలడం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. వాతావరణంలో తేమ కారణంగా, జుట్టులో చుండ్రు మొదలవుతుంది. ఇది జుట్టు మూలాల నుంచి బలహీనపరుస్తుంది. ఇలాంటి సమయంలో జుట్టు రాలడాన్ని నివారించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిలో ఉల్లిపాయ రసం కూడా ఒకటి. ఉల్లిపాయ రసం చుండ్రును తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. జుట్టు మూలాల నుంచి కూడా బలంగా మారుతుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని ఎలా అప్లై చేయాలి ?
ముందుగా 4-5 తాజా ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను గ్రైండర్‌లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని వడకట్టండి. ఉల్లిపాయల పేస్ట్ నుంచి వచ్చిన రసాన్ని జుట్టు పొడిగా ఉన్నప్పుడు నేరుగా తలపై అప్లై చేయాలి. కాటన్‌ను ఉల్లిపాయ రసంలో ఉంచి సున్నితంగా జుట్టుకు పట్టించండి. ఇలా అప్లై చేసిన తర్వాత జుట్టును 30 నిమిషాల నుంచి 1 గంట వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయండి . వీలైతే కండీషనర్ కూడా వాడవచ్చు.
Also Read: జుట్టు రాలడాన్ని తగ్గించే హెయిర్ మాస్క్ ఇదే !
ఇవి కూడా ట్రై చేయండి..
ఉల్లిపాయ రసంలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె, 1 టీస్పూన్ అలోవెరా జెల్ కూడా కలుపి తలకు అప్లై చేయవచ్చు. ఇది మీ జుట్టుకు అదనపు తేమను అందించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.
చుండ్రు ఎక్కువగా ఉన్నట్లయితే, ఉల్లిపాయ రసంలో 1 టీస్పూన్ నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది చుండ్రును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
మొదటి సారి ఉల్లిపాయ రసాన్ని వాడేవారు వారానికి 2-3 సార్లు ట్రై చేయండి. క్రమంగా తగ్గించి వారానికి 1-2 సార్లు కూడా ఉల్లిపాయ రసాన్ని తలకు అప్లై చేయవచ్చు.
మీరు తలకు ఉల్లిపాయ రసం అప్లై చేసినప్పుడు కనక చికాకు లేదా అలెర్జీ అనుభవిస్తే.. వెంటనే ఉల్లిపాయ తలస్నానం చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.