BigTV English

Hair Care: జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

Hair Care: జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరగాలంటే ఇలా చేయండి

Hair Care: మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల జుట్టు రాలడం, పల్చబడడం వేగంగా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో, మీరు సహజ పద్ధతిలో పొడవైన, మందపాటి జుట్టు కావాలని కోరుకుంటే మాత్రం కొన్ని రకాల హోం రెమెడీస్ మీకు సహాయపడతాయి. ఇవి మీ జుట్టును సహజంగానే మందంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి.


1. ఉసిరి, కొబ్బరి నూనె: 
కావలసినవి:
ఉసిరి పొడి- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం: 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని, దానిలో 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి.దీన్ని కస్త వేడి చేసి చల్లారాక జుట్టు మూలాలకు అప్లై చేయాలి.మృదువుగా మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ తర్వాత ఉదయం మీరు వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు ఉపయోగించండి.ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా రాలకుండా ఉంటుంది.


2. మెంతి గింజల పేస్ట్: 

ఒక రోజు ముందు చిన్న కప్పు మెంతులను కాస్త నీరు వేసి నానబెట్టాలి. తర్వాత రోజు గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టు మూలాలపై అప్లై చేసి 30-40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఈ రెమెడీని వారానికి 1-2 సార్లు ఉపయోగించండి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా విపరీతంగా జుట్టు పెరుగుతుంది.

3. అలోవెరా జెల్: 

కలబంద ఆకు నుండి తాజా జెల్ తీసి తలకు పట్టించాలి.దీనిని సున్నితంగా మసాజ్ చేసి 1 గంట పాటు అలాగే ఉంచండి.
ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి. ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు జుట్టు అప్లై చేయండి. జుట్టు సంబంధిత సమస్యలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ను తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టుకు తగిన పోషకాలు అందుతాయి. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది.

4. ఉల్లిపాయ రసం: 

3-4 ఉల్లిపాయలను తీసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసి దాని రసాన్ని తీయండి. ఈ రసాన్ని కాటన్ బాల్‌తో జుట్టు మూలాలపై రాయండి. దీన్ని 30-45 నిమిషాలు అలాగే ఉంచండి.ఆ తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయండి. మంచి ఫలితాల కోసం వారానికి 2 సార్లు దీనిని ఉపయోగించండి.

Also Read: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

సన్నని, బలహీనమైన జుట్టును బలంగా చేయడానికి ఈ హోం రెమెడీస్ తప్పకుండా ట్రై చేయండి. నేచురల్ రెమెడీస్ వల్ల జుట్టు ఒత్తుగా ఉండటమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీంతో పాటు, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి కూడా జుట్టు ఆరోగ్యానికి అవసరం.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Banana leaf food: డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం! ఈ ఆకుపై భోజనం చేస్తే జరిగేది ఇదే!

Heart Attack: గుండెపోటు లక్షణాలను ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతున్నారా ? జాగ్రత్త !

Period leave Men: కర్ణాటకలో మహిళలకు పీరియడ్ లీవ్.. మరి పురుషులకు?

Tollywood: జూబ్లీహిల్స్ లో సందడి చేసిన సింగర్ సునీత.. వాటికే అందం తెస్తూ!

Big Stories

×