Hair Conditioner: జుట్టు రాలడం అనేది ప్రస్తుతం చాలా సాధారణ సమస్యగా మారింది. చాలా మంది నేడు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొని వాడుతూ ఉంటారు. వీటి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే నేచురల్ గా ఇంట్లో దొరికే పదార్థాలను జుట్టుకు వాడటం మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతే కాకుండా డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంది. ఈ సమయంలోనే జుట్టు సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు పెరుగుతాయి. ముఖ్యంగా చివర్లో చిట్లడంతో పాటు ఈ సీజన్ లో చుండ్రు సమస్య చాలా కామన్ అనే చెప్పాలి. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఖరీధైన ఉత్పత్తులను కొనేందుకు కూడా కొంత మంది వెనకాడరు. చలికాంలో జుట్టు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి మంచి హెయిర్ కండీషనర్ వాడటం చాలా ముఖ్యం.
చలికాలంలొ మీ జుట్టును సంరక్షించుకోవడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఎగ్ కూడా జుట్టు సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. హెయిర్ కండీషనర్ కోసం ఎగ్ ఎల్లో చాలా బాగా పనిచేస్తుంది. ఎగ్ ఎల్లోతో హెయిర్ కండిషనర్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ .
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఎగ్ తో కండిషనర్ ఎలా తయారు చేసుకోవాలి ? ఎలా వాడాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ హెయిర్ కండీషనర్.. తయారీకి కావలసిన పదార్థాలు:
ఒక గుడ్డు పచ్చసొన
2 స్పూన్లు పెరుగు (ఇష్టమైతే)
2 స్పూన్లు కొబ్బరి లేదా ఆలివ్ నూనె
1 స్పూన్ తేనె
హెయిర్ కండీషనర్ తయారీ, అప్లై చేసే విధానం:
హెయిర్ కండీషనర్ తయారు చేయడానికి, ముందుగా ఒక ఎగ్ తీసుకుని అందులోని పచ్చసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీని తరువాత, ఎగ్ పచ్చసొనలో కొబ్బరి లేదా ఆలివ్ నూనె, తేనె, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నీ బాగా కలపిన తర్వాత ఇది మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది. ఇప్పుడు మీ హెయిర్ కండీషనర్ సిద్ధంగా ఉంది. దీన్ని మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు పూర్తిగా అప్లై చేయండి. తర్వాత జుట్టుపై కనీసం అరగంట పాటు ఉంచండి. అనంతరం జుట్టును కొద్దిగా షాంపూ, సాధారణ నీటితో వాష్ చేయండి. దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల మీ జుట్టు స్మూత్‌గా , షైనీగా మారుతుంది.
ఎగ్ కండీషనర్ ప్రయోజనాలు:
జుట్టును దృఢంగా చేస్తుంది.
జుట్టుకు లోతుగా తేమను అందిస్తుంది.
సహజంగా జుట్టుకు మెరుపునిస్తుంది.
Also Read: భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగాలా? వద్దా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
హెయిర్ కండీషనర్ అప్లై చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
గుడ్ల వాసన మీకు నచ్చకపోతే దానికి కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేయండి . ఇది ఎగ్ దుర్వాసనను తొలగిస్తుంది.
ఈ కండీషనర్‌ను అప్లై చేసిన తర్వాత, మీ జుట్టును చల్లని లేదా సాధారణ నీటితో వాష్ చేయండి.
మీరు ఈ కండీషనర్‌ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
గుడ్డు జుట్టుకు ఎందుకు ఉపయోగపడుతుంది ?
ఎగ్ పచ్చసొనలో ప్రోటీన్, బయోటిన్, ఫోలేట్ , విటమిన్లు ఎ, డి, ఇ , కె పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టును బలంగా , మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా జుట్టును లోతుగా తేమ అందిస్తుంది. దీని వల్ల పొడిబారిన జుట్టు సమస్య తొలగిపోతుంది.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.