BigTV English

Lemon Juice Preparation: నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేస్తారు..? ఎండాకాలంలో టేస్టీ షర్బత్ ఇలా తాగేసేయండి!

Lemon Juice Preparation: నిమ్మకాయ షర్బత్ ఎలా తయారు చేస్తారు..? ఎండాకాలంలో టేస్టీ షర్బత్ ఇలా తాగేసేయండి!

How to Prepare Lemon Juice for Summer: ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎండలు మండిపోతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓ వైపు ఎండ మరోవైపు వేడి గాలులు, ఉక్కపోత ఇలా జనం సతమతమవుతుంటారు. అయితే, ఈ క్రమంలో రిలీఫ్ కోసం పానీయాలను తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఫ్రూట్ జ్యూస్ లేదా ఇతర పానీయాలు తీసుకుంటుంటారు. అందులో ముఖ్యంగా నిమ్మకాయ షర్బత్ కు ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే నిమ్మకాయ షర్బత్ తాగిన వెంటనే అలసట, వేడి తాపం నుంచి రిలీఫ్ అవుతుంటారు. అందుకే నిమ్మకాయ షర్బత్ తాగినవెంటనే హమ్మయ్యా.. కొంత రిలీఫ్ గా ఉంది అని అంటుంటారు. అంతేకాదు.. చాలా తక్కువ ఖర్చుతో ఈ నిమ్మకాయ షర్బత్ తయారవుతుంది.


నిమ్మకాయ షర్బత్ ను ఎలా తయారు చేస్తారో చూద్దాం..

నిమ్మకాయ షర్బత్ కు కావాల్సినవి.. ముందుగా ఏదైనా పాత్రలో కొంత చల్లటి నీరును తీసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటికి తగ్గట్టుగా రెండు లేదా మూడు దోర నిమ్మకాయలు తీసుకుని వాటిని రెండు ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత వాటి రసంను ఆ నీటిలో పిండాలి. ఆ తర్వాత ఆ నీటిని రెండుమూడుసార్లు కలపాలి. ఆ తరువాత అందులో సరైన విధంగా అంటే.. ఆ నీటికి తగ్గట్టుగా, అదేవిధంగా నిమ్మకాయ పులుపునకు తగ్గట్టుగా ఉండే విధంగా అందులో పంచదార వేసుకోవాలి. అలాగే స్పూన్ లేదా రెండు స్పూన్ల ఉప్పును కలపాలి. ఆ తరువాత ఓ గంటెతో బాగా కలపాలి. ఆ తరువాత ఆ నీరును రెండు పెద్ద పాత్రల్లోకి తీసుకుని…ఒకదానిలోంచి మరొకపాత్రలోకి, ఈ పాత్రలోనుంచి ఆ పాత్రలోకి ఆ నీటిని పోయాలి. ఇలా చేస్తే అదంతా బాగా మిక్స్ అవుతుంది. అలా షర్బత్ తయారవుతుంది. ఆ షర్బత్ ను తాగాలి.


Also Read: ఓరినీ.. ఎండిన నిమ్మకాయతో ఇన్ని లాభాలా..?

ఓకవేళ ఆ షర్బత్ ను ఇంకా బాగా టేస్టీగా చేయాలి అనుకుంటే అందులో కొంచెం సబ్జా గింజలను వేయాలి. అదేలా అంటే.. ముందుగానే నీటిలో సబ్జా గింజలను నానబెట్టాలి. అవి బాగా నానినంకా అదంతా కూడా నిమ్మకాయ షర్బత్ లో పోసి కలపాలి. కొంతమంది అందులో ఐస్ ముక్కలు కూడా యాడ్ చేస్తారు. అప్పుడు తీసుకుంటే ఇంకా బాగా టెస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న నిమ్మకాయ షర్బత్ ను తాగిన వెంటనే చాలా రిలీఫ్ గా, హాయ్ గా అనిపిస్తుంది. అంతేకాదు… మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తుంది.

నిమ్మకాయ షర్బత్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండల వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో శరీరం రోజంతా చల్లగా ఉండేలా చేస్తుంది. అందుకే పల్లెటూర్లలో నిమ్మకాయ షర్బత్ ను చాలా విరివిగా చేసుకుని తాగుతుంటారు.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×