BigTV English

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Pimples On Face: చర్మం మెరుస్తూ, మృదువుగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ మొటిమలు చాలా మంది ముఖ చర్మాన్ని పాడు చేస్తాయి. చాలా కాలం పాటు ఉండే మొటిమలు, మచ్చలు కూడా రావడానికి కారణం అవుతాయి. దీంతో ఎక్కువ మంది మార్కెట్ నుంచి ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ వాటి దుష్ప్రభావాలను భరించడం అంత తేలికైన పని కాదు. అటువంటి పరిస్థితిలో, ఈ సమస్యను ఎదుర్కోవడంలో  చాలా ప్రభావవంతంగా ఉండే కొన్ని క్లియర్ స్కిన్ చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


పసుపు:
పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమల వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. అంతే కాకుండా ముఖంపై అదనపు నూనెను గ్రహిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడే గుణం తేనెలో ఉంది. ఒక చెంచా పసుపులో రెండు చెంచాల తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేయాలి.

పుదీనా :
పుదీనా మీ చర్మాన్ని చల్లబరచడమే కాకుండా మొటిమలతో పోరాడడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనా ఆకులను గ్రైండ్ చేసి దాని రసాన్ని తీసి రాత్రి ముఖానికి రాసుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత కడుక్కోవాలి. దీంతో మీరు కొన్ని రోజుల్లో మొటిమలు లేని మీ ఫేస్ చూసుకుంటారు.


వేప :
వేప ఆకులు చర్మ సంరక్షణకు కూడా చాలా మేలు చేస్తాయి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి . వేప ఆకులను గ్రైండ్ చేసి, పసుపు , నీళ్ళు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. మీరు వేప పొడిని కూడా ఉపయోగించవచ్చు. దీని వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయి.

శనగ పిండి :
మొటిమలతో బాధపడుతున్న చర్మానికి కూడా శనగపిండిని ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శనగ పిండి అనేది సహజమైన క్లెన్సర్. ఇది ముఖం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది. ఒక చెంచా శనగపిండిలో నీటిని కలిపి పేస్ట్‌లా చేసి, దీనిని ముఖానికి అప్లై చేసిన తర్వాత, 10 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ ప్యాక్‌ని వారానికి 3 సార్లు ఉపయోగించడం వల్ల మీ చర్మం మొటిమలు లేకుండా మరియు మృదువుగా మరియు మెరుస్తూ ఉంటుంది.

Also Read: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

ఓట్స్ :
మీరు జిడ్డు చర్మం, మొటిమలను వదిలించుకోవాలనుకుంటే , ఓట్స్ ఉపయోగించడం కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓట్స్‌లో ఉండే గుణాలు చర్మాన్ని శుభ్రపరచి, మొటిమలను తగ్గిస్తాయి. దీని కోసం, ఓట్స్ గ్రైండ్ చేసి, ఆపై కాస్త పసుపు వేసి ముఖానికి పట్టించండి. దీనిని 15 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం ద్వారా ముఖంపై మచ్చలు మాయం అవుతాయి. అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Makhana: వీళ్లు.. పొరపాటున కూడా మఖానా తినకూడదు !

Stress: క్షణాల్లోనే.. స్ట్రెస్ తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Vitamin K Deficiency: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Big Stories

×