BigTV English

Menstrual Hygiene Day 2024: ఋతు క్రమంలో హైజిన్‌గా ఉండట్లేదా..? తీవ్ర అనారోగ్య సమస్యల పాలవుతారు!

Menstrual Hygiene Day 2024: ఋతు క్రమంలో హైజిన్‌గా ఉండట్లేదా..? తీవ్ర అనారోగ్య సమస్యల పాలవుతారు!

Menstrual Hygiene Day 2024: ఋతు పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రతీ సంవత్సరం మే 28న జరుపుకుంటారు. మహిళల్లో ఋతు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళలకు ప్రతి నెలా వచ్చే నెలసరిలో పరిశుభ్రత పాటించకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా అయితే ఋతు చక్రం 28 రోజుల పాటు ఉంటుంది. దాదాపు మహిళలకు ఐదు రోజుల పాటు పీరియడ్స్ వస్తుంది. అయితే ఈ పీరియడ్స్ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శానిటరీ న్యాప్ కిన్

శానిటరీ నాప్ కిన్ లను ఎంచుకోవడంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే శానిటరీ ప్యాడ్ లు వివిధ రకాలుగా, కవర్లతో తయారు చేస్తారు. వీటి వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్లు, పునరుత్పత్తి, ఫంగల్ ఇన్పెక్షన్స్ వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు దీని వల్ల మహిళల్లో వంధ్యత్వానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల శానిటరీ న్యాప్ కిన్ ఎంచుకునే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నవి వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.


ఒకటే ప్యాడ్ ధరించడం

నెలసరి సమయంలో రోజు ధరించే ప్యాడ్ ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. రోజులో 6 నుంచి 8 గంటలకు ఒకసారి ప్యాడ్ లను ఛేంజ్ చేస్తూ ఉండాలి. అంతేకాదు రక్తస్రావం ఎక్కువగా జరిగితే ముందుగానే మార్చుకుంటే మంచిది. ఎక్కువసేపు ఒకటే ప్యాడ్ ను ధరించడం వల్ల ఇన్పెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. రోజంతా ఒకటే ప్యాడ్ ధరిస్తే మాత్రం తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Also Read: Menstrual Hygiene Day 2024: ఋతు క్రమంలో హైజిన్‌గా ఉండట్లేదా.. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..

చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి

శానిటరీ ప్యాడ్ లను యూజ్ చేసే క్రమంలో చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్యాడ్ మార్చుకున్న అనంతరం చేతులను హాండ్ వాష్ తో పరిశుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే తెలియని బ్యాక్టీరియా చేతిలో ఉండిపోతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు రక్తస్రావం జరిగే సమయంలో తరచూ పరిశుభ్రంగా కడుక్కోవడం మంచిది.

Tags

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×