BigTV English

Hair Oiling Mistakes : రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

Hair Oiling Mistakes : రాత్రిపూట జుట్టుకు నూనె రాస్తున్నారా..?

hair health


Hair Oiling Mistakes : హెయిర్ హెల్దీగా ఉండేందుకు చాలా మంది నైట్ పడుకునే ముందు జుట్టుకు నూనె రాసుకుంటారు. అయితే ఈ అలవాటు జుట్టుకు మంచిదా.. కాదా అనే సందేహం మనలో ఉంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం.. జుట్టుకు నూనె రాయడం హెయిర్‌కు చాలా మంచిది. ఇది మన జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అయితే హెయిర్ ఆయిల్‌ అప్లై చేయాలంటే కొన్ని పద్దతులు పాటించాలి. అప్పుడే ప్రయోజనాలను పొందుతారు.

మనలో కొందరు జుట్టుకు ఆయిల్ అప్లై చేసి రాత్రంతా అలానే వదిలేస్తారు. అలా చేయడం వల్ల కొన్ని నష్టాలు జరగొచ్చు. స్కాల్ప్ కూడా సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి రాత్రిపూట తలకు నూనె రాసుకుని వదిలేస్తే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే జుట్టుకు ఎక్కువసేపు నూనె రాసుకోవడం వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది.


Read More : మీ మూడ్ అస్సలు బాగోలేదా.. ఇలా సెట్ చేయండి!

రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడం వల్ల.. అది బెడ్ షీట్లకు అంటుకుని.. దుమ్ము, ధూళి అంటుకుపోతాయి. దీంతో చుండ్రు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జుట్టుకు నూనె రాసి అలానే వదిలేస్తే జుట్టు సమస్యలు అధికమవుతాయి.

అంతేకాకుండా మనలో కొందరు కొబ్బరి నూనెను వేడి చేసి తలకు మసాజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలహీనపడతాయి. బాగా వేడి నూనెను తలకు పట్టించడం వల్ల దురద సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోరువెచ్చని నూనెతో జుట్టుకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువ లాభం పొందుతారు. తలలో రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. ఇది మీ జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.

రాత్రంతా జుట్టుకు నూనె రాయడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు అది అడ్డుపడుతుంది. హెయిర్ ‌పై ఆయిల్ ఎక్కువ ఉంచుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని వల్ల నెత్తిమీద, కనుబొమ్మల మీద, చెవుల వెనుక, ముక్కు చుట్టూ పసుపు మచ్చలు వస్తాయి. రాత్రిపూట జుట్టుకు నూనెను ఉంచడం మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.

Read More : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. సైన్స్ ఏం చెబుతుంది..!

జుట్టుకు కొబ్బరి నూనెతో పాటు ఆలివ్ ఆయిల్, బాదం నూనె వంటివి కూడా వాడవచ్చు. ఇది హెయిర్ ఫాల్‌ను నివారిస్తుంది. అంతేకాదు ఈ నూనెలను రాసుకోవడం వల్ల తలకు రక్తప్రసరణ బాగుంటుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. పొడి, సిల్కీ జుట్టుకు రోజూ నూనె రాస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు తగినంత తేమ అందుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది.

అయితే షాంపూ చేయడానికి అరగంట ముందు నూనె రాసుకుంటే సరిపోతుంది. హెయిర్‌ ఆయిల్‌ను తలకు అప్లై చేసేటప్పుడు సున్నితంగా మసాజ్ చేయండి. చాలా గట్టిగా ఆయిల్ తలకు రుద్దడం వల్ల జుట్టు చిట్లుతుంది. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది.

Disclaimer : ఈ కథనాన్ని వివిధ వైద్య అధ్యయనాలు ఆధారంగా మీ అవగాహన కోసం అందిస్తున్నాం.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×