Valentine’s Day OYO: వాలంటైన్స్ డే అనేది ప్రేమికులకు ఎంతో ఇష్టమైన రోజు. తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు. కొంత మంది ఓయో రూమ్స్ బుక్ చేసుకుని శృంగార విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. కానీ, తాజాగా ఓయో రూమ్స్ బుకింగ్స్ కు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వాలెంటైన్స్ డే కోసం రూమ్ బుక్ చేసుకునేటప్పుడు తీసుకోవలసిన కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
జంటల కోసం OYO సరికొత్త రూల్స్
⦿ రిలేషన్ పిష్ కుసంబంధించిన ప్రూఫ్
ఓయో ఇప్పుడు జంటలు హోటల్ లో చెక్ ఇన్ సమయంలో వారి మధ్య సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. హోటల్ పాలసీని బట్టి జాయింట్ ఐడీ లేదంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది.
⦿ బుకింగ్ కన్ఫర్మేషన్
మీరు ఆన్ లైన్ లో రూమ్ బుక్ చేసుకున్నప్పటికీ.. చెక్ ఇన్ టైమ్ లో అవసరమైన ఆధారాలను చూపించాలి. పెళ్లి కాని వారి కోసం కొత్త నిబంధనలు అందుబాటులో ఉన్నాయి.
⦿ హోటల్ పాలసీలు
ఆయా హోటల్స్ కు సొంతంగా కొన్ని నియమాలు ఉంటాయి. ఓయో బుక్ చేసుకునే సమయంలో ముందుగానే కాల్ చేసి వారి నియమాలకు మీరు సూట్ అవుతారో? లేదో? నిర్ధారించుకోండి.
⦿ పెళ్లికాని జంటలకు నో ఎంట్రీ!
కొన్ని ప్రాంతాలు, నిర్దిష్ట హోటళ్లలో పెళ్లికాని జంటలు కలిసి ఉండేందుకు అనుమతించకపోవచ్చు. మీరు బుక్ చేసుకునే ముందుకు నిర్దిష్ట హోటల్ పాలసీని ఎంక్వయిరీ చేసుకోవడం మంచిది.
⦿ ID వెరిఫికేషన్
చెక్-ఇన్ టైమ్ లో జంటలు ఇప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన IDని సమర్పించాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటే భాగస్వాములు ఇద్దరూ ఐడీలు తీసుకెళ్లాలి.
వాలెంటైన్స్ డే కోసం OYO బుకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాలెంటైన్స్ డే వేళ ఓయో హోటల్ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఈ నేపథ్యంలో ఓయో పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలను పాటించాలి.
⦿ హోటల్ పాలసీని చెక్ చేయండి
ఓయో హోటళ్లు రకరకాల నియమాలను కలిగి ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునే హోటల్ అవివాహిత జంటలను అంగీకరిస్తుందో? లేదో? ముందుగా తెలుసుకోండి. వారికి ఏ ఆధారాలు చూపించాలో ఎంక్వయిరీ చేసుకోండి.
⦿ ముందుగానే బుక్ చేసుకోండి
వాలెంటైన్స్ డే సమయంలో ఓయో రూమ్స్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ముందుగానే రూమ్ బుక్ చేసుకోవడం మంచిది.
⦿ రూల్స్ గురించి ఆరా తీయండి
ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. పెళ్లి కాని జంటలు OYO రూమ్ ను బుక్ చేసుకోవడం చాలా కష్టం. ఇబ్బందులు లేని హోటల్స్ చూసుకోండి.
⦿ వాలెంటైన్స్ డే ప్యాకేజీలు చెక్ చేయండి
పలు OYO హోటళ్ళు ప్రత్యేక వాలెంటైన్స్ డే ప్యాకేజీలను అందిస్తున్నాయి. వాటి గురించి ముందుగా ఆరా తీయండి.
⦿ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోండి
ఓయో హోటళ్లు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నా, కొన్ని చోట్ల పెళ్లికాని జంటలకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలి.
⦿ చెల్లింపులు
కొన్ని హోటళ్లు ఆన్ లైన్ పేమెంట్స్ అంగీకరించకపోవచ్చు. నగదు లేదా కార్డును అంగీకరించవచ్చు. అందుకే, ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read Also: వారం రోజుల ప్రేమికుల పండుగ, ఒక్కో రోజు ఒక్కో స్పెషల్!
పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే కోసం టిప్స్
⦿ రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టించుకోండి
ఓయో రూమ్స్ ను రొమాంటిక్ గా మార్చుకోండి. కొవ్వొత్తులు, ఫెయిరీ లైట్ల నడుమ మీ భాగస్వామి కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేయండి. రొమాంటిక్ అట్మాస్పియర్ ను క్రియేట్ చేసుకోండి. మొత్తంగా ఆయా నిబంధనలకు అనుగుణంగా ఓయో రూమ్స్ లో వాలంటైన్స్ డేను ఎంజాయ్ చేయండి.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?