Valentine’s Day 2025: వాలెంటైన్స్ డే. లవ్ లో ఉన్న వాళ్లకు ఈ రోజు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టపడిన వారికి తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. ప్రేమ, ఆప్యాయతను సరికొత్తగా పంచుకుంటారు. వాలెంటైన్స్ డే వేడుకలు ఫిబ్రవరి 7న ప్రారంభమై ఫిబ్రవరి 14న కొనసాగుతాయి. ఈ 7 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రకంగా మీ భావాలను వ్యక్తపరుచుకునే అవకాశం ఉంటుంది. గులాబీలు ఇవ్వడం నుండి చాక్లెట్ల వరకు, కౌగిలింతల నుంచి ముద్దులు పెట్టుకోవడం వరకు ప్రతి దానికి ఓ రోజు కేటాయించబడింది. వాలంటైన్స్ వీక్ లో ఏ రోజు ఏం చేస్తారంటే..
❤ రోజ్ డే (ఫిబ్రవరి 7)
వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో ప్రారంభమవుతుంది. మీరు ఇష్టపడే వ్యక్తులకు గులాబీలను ఇచ్చి మీ ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసుకోవచ్చు. మీరు ప్రేమలో ఉన్న వ్యక్తికి సరిపడే గులాబీని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఎర్ర గులాబీ ప్రేమకు, తెల్ల గులాబీ స్వచ్ఛతకు, పసుపు గులాబీ స్నేహానికి సహా ఒక్కో గులాబీ ఒక్కో వ్యక్తికరణకు ఉపయోగపడుతుంది.
❤ ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8)
ఈ రోజు మీ భావాలను మీరు ఇష్టపడే వ్యక్తికి తెలియజేసుకోవచ్చు. ఎదుటి వారి మనసుకు హత్తుకునేలా ప్రపోజ్ డేను ప్లాన్ చేసుకోవచ్చు. ప్రపోజ్ డే అనేది మీ సంబంధాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.
❤ చాక్లెట్ డే (ఫిబ్రవరి 9)
చాక్లెట్ డే అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య తీపిని పెంచేది. మీ ప్రేమను చాక్లెట్ల రూపంలో పంచుకోవచ్చు. ఈ రోజున మీరు ఇష్టపడే వ్యక్తికి వారు ఇష్టపడే చాక్లెట్ ను అందించి మీ ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చు.
❤ టెడ్డీ డే (ఫిబ్రవరి 10)
టెడ్డీ డే అనేది ఆప్యాయతకు గుర్తుగా జరుపుకుంటారు. మీరు ఇష్టపడే వ్యక్తికి ఈ రోజున ముద్దుగా ఉండే టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమను మరింత స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు.
❤ ప్రామిస్ డే (ఫిబ్రవరి 11)
ప్రామిస్ డే నాడు.. ప్రేమలో ఉన్న వాళ్లు ఒకరికొకరు అర్థవంతమైన వాగ్దానాలు చేసుకుంటారు. నమ్మకం, నిబద్ధతపై దృష్టి పెడతారు. కలిసి జీవిత ప్రయాణం చేసేందుకు ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలో నిర్ణయించుకుంటారు. మీ అంకితభావాన్ని వ్యక్తపరచడానికి ఇది మంచి రోజు.
❤ హగ్ డే (ఫిబ్రవరి 12)
ప్రేమ, ఆప్యాయతను వ్యక్తపరచడానికి కౌగిలింత అనేది ఒక బలమైన మార్గం. హగ్ డే రోజున మీరు ఇష్టపడే వ్యక్తిని గట్టి హగ్ చేసుకుని మీ ప్రేమను చెప్పుకోవచ్చు. కౌగిలింత అనేది ఎదుటి వ్యక్తికి భరోసా కల్పిస్తుంది.
❤ కిస్ డే (ఫిబ్రవరి 13)
వాలంటైన్స్ వీక్ లో కిస్ డే అనేది కీలకమైనది. తమ భాగస్వామికి ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్త పరిచే అవకాశం ఉంటుంది.
❤ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14)
వాలెంటైన్స్ డే ఈ రోజుతో ముగిసిపోతుంది. ప్రేమలో ఉన్న జంటలు బహుమతులు, విందులు, గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా తమ ప్రేమను ఒకరికొకరు తెలియజేసుకుంటారు.
Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?