BigTV English

Tammareddy Bharadwaj: అర్ధరాత్రి మందు తాగి హీరోయిన్ల తలుపులు కొడతారు.. అమ్మాయిల వీక్ నెస్.. ?

Tammareddy Bharadwaj: అర్ధరాత్రి మందు తాగి హీరోయిన్ల తలుపులు కొడతారు.. అమ్మాయిల వీక్ నెస్.. ?

Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలను నిర్మించి.. ఇండస్ట్రీకి హిట్లు అందించిన ఆయన ఈ మధ్య యూట్యూబ్ కే పరిమితమయ్యాడు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడుగా కొన్ని కొన్ని వివాదాలను పరిష్కరిస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా తన పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తూ.. ఇండస్ట్రీలో ఏది ట్రెండింగ్ వార్తనో తెలుసుకొని.. దానిమీద తన అభిప్రాయం చెప్తూ ఉంటాడు.


ఇక మొన్నటికి మొన్న పూనమ్ కౌర్ .. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెల్సిందే. డైరెక్టర్ త్రివిక్రమ్  శ్రీనివాస్ పై  తాను మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేశానని,  దాన్ని ఎవరు తీసుకోలేదని ఆరోపించింది. “త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నేను మా అసిసోయేషన్ లో ఫిర్యాదు చేశాను. కానీ, నా ఫిర్యాదును తిరస్కరించారు. రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. నన్ను సైలెంట్ గా ఇగ్నోర్ చేశారు. ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలి” అంటూ చెప్పుకొచ్చింది. దానిపై తమ్మారెడ్డి స్పందించాడు.

పూనమ్.. ఎప్పుడు, ఏ  సంవత్సరంలో ఫిర్యాదు చేసిందో మాకు తెలియదు. మా వరకు ఆ ఫిర్యాదు రాలేదు. అయినా అప్పటికీ ఈ కమిటీ ఏర్పాటు అయ్యి ఉంటే.. మాకు ఇప్పటికే తెలిసేది. అక్కడ ఉన్న ఫిర్యాదు బాక్స్ లో ఒక్క ఫిర్యాదును కూడా మేము చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి హీరోయిన్స్ లైంగిక వేధింపుల గురించి మనసువిప్పి మాట్లాడాడు.  హీరోయిన్స్  ఫేమ్ తెచ్చుకొనేవరకు అన్నింటికీ ఓకే అని.. ఆ తరువాత విభేదాలు  వచ్చాయని మీడియా ముందుకు వస్తున్నారు అంటూ  చెప్పుకొచ్చాడు.


Vijay Devarakonda: విజయ్‌ను వెంటాడుతున్న చొక్కా సెంటిమెంట్.. విప్పితే కష్టమే.. ?

హీరోయిన్లు ఎదగడం కోసం వాళ్లకు వాళ్లే కమిట్ అయ్యి.. ఆ తరువాత గొడవలు పడుతున్నారని తెలిపాడు. ఇక  సినిమా ఒప్పుకొనేటప్పుడు కమిట్ మెంట్స్ అడుగుతారు అనడంలో నిజం లేదని.. కొంతమంది అలా ఉన్నా అందరూ అలా లేరని తెలిపాడు.” అలా అవకాశం ఇస్తామని కమిట్ మెంట్ అడగడం వర్క్ హెరాస్ మెంట్ కిందకు వస్తుంది. అది తప్పు. మ్యూచువల్ గా  ఇద్దరు ఒకటి అయినా.. ఆ తరువాత గొడవల వలన విడిపోతే.. అది కూడా అడిగినవారి తప్పే అవుతుంది. ఒక అమ్మాయికి ఛాన్స్ ఇచ్చి లొంగదీసుకున్నాకుండా.. లొంగదీసుకోవడం తప్పే కాబట్టి.. ఏరోజు ఆ నిజం బయటకు వచ్చినా అది చేసినవాడు శిక్షార్హుడే.

చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, హీరోయిన్స్.. ఫలానా  టైమ్ లో నేను లొంగిపోవాల్సి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి తలుపులు తట్టి నన్ను లొంగదీసుకున్నవారు ఉన్నారని బహిరంగంగా చెప్పినవారు ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ” మన సమాజంలో ఆడపిల్ల అంటేనే లోకువ. సినిమాల్లో ఉన్నారంటే మరీ లోకువ. ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. ఇక ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది. ఈ హీరోయిన్.. ఆ హీరోతో అంట.. ఆ అమ్మాయి.. ఈ అబ్బాయితో అంట అనే మాటలు వినపడుతూ ఉంటాయి.

నైట్ తలుపులు కొట్టేవారందరూ మందు తాగి వచ్చేవారే. వాళ్లకు నాకు దొరకలేదు.. వాడికి దొరికింది అనే ఈగో వలన వచ్చినవారే. ఆ టైమ్ లో వెళ్లి.. వాడితో వెళ్ళావ్.. నా దగ్గరకు రావా అని అడుగుతారు. ఇలా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రతి మనిషికి వీక్ నెస్ ఉంటుంది. ఒకరికి డబ్బు, ఒకరికి అమ్మాయి, ఇంకొకరికి పదవి.. ఆ వీక్ నెస్ గురించి కాకుండా.. మంచి గురించి మాట్లాడొచ్చు కదా. సమాజంలో అమ్మాయిల వీక్ నెస్ గురించి మాట్లాడితే సమాజంలో  ఎంతమంది నిలబడతారు.. ఇండస్ట్రీలోనే కాదు .. ఎక్కడైనా సరే. ఇక పాష్ రూల్స్ ప్రకారం తీసుకుంటే.. ఏ సెక్టార్ లో అయినా మగవాళ్ళు ఉంటారా. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×