Telangana secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడ్డాయి. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ సెక్రటేరియట్ సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ అంతస్తులో పెచ్చులు స్వల్పంగా ఊడిపడ్డాయి. ఐదో అంతస్తు నుంచి బయటకు వచ్చే మెయిన్ ఎంట్రన్స్ వద్ద పెచ్చులు ఊడిపడడంతో ప్రమాదం జరిగింది. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రమాదంలో కారు డ్యామేజ్ అయనట్లు తెలుస్తోంది. కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. నిర్మాణ సమయంలోనూ కొన్ని అపశృతులు దొర్లినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. రూ.1200 కోట్లతో సచివాలయాన్ని నాసిరకంగా నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే సచివాలయ నిర్మాణానికి భారీ ఖర్చుపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.
అయితే, ఈ సచివాలయాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మాణం నుంచే కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నాయకులు పలు ఆరోపణలు చేశారు. సచివాలయ నిర్మాణంలో సమస్యలు ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా సచివాలయ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఛాంబర్ తో పాటు.. టాయ్ లెట్స్ లోనూ శబ్ధాలు వస్తున్నాయని అధికారులకు వివరించారు. ఇదంతా లోలోపల జరిగింది.. కానీ ఇవాళ సచివాలయం సౌత్, ఈస్ట్ ప్రధాన ద్వారా లోపలికి వెళ్లే ప్లేస్ లో ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే మంత్రులు, అధికారులు వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. అయితే ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడి కారుపైన పడ్డాయి. పెద్ద ఎత్తున శబ్ధం రావడంతో అధికారులు, అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సచివాలయంలో నాణ్యతా ప్రమాణాల పరీక్షలు నిర్వహించాలని నెటిజట్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.