BigTV English

Relationship: ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే మీరు నేర్చుకోవాల్సిన పదం ఒకటి ఉంది, అదేంటో తెలుసుకోండి

Relationship: ఏ బంధమైనా కలకాలం నిలవాలంటే మీరు నేర్చుకోవాల్సిన పదం ఒకటి ఉంది, అదేంటో తెలుసుకోండి

భార్యాభర్తల బంధమే కాదు, ఏ బంధమైనా పదికాలాలపాటు కాపాడుకునే బాధ్యత మనదే. అన్నదమ్ముల నుంచి అక్కా చెల్లెలు, తండ్రి కొడుకులు ఇలా ప్రతి బంధాన్ని కాపాడుకోవాలంటే మిమ్మల్ని కొంతవరకు మార్చుకోవాలి. తప్పు మీ వైపు ఉంటే తగ్గక తప్పదు.  ‘సారీ’ అనే పదం చెప్పడం నేర్చుకోండి. ఒకరిని క్షమించడం నేర్చుకుంటే మీ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది.


దంపతుల మధ్య ఎన్నో తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న తగాదాలే పెద్దవిగా మారిపోతాయి. ఆ పెద్దవి కూడా విడాకులకు దారి తీస్తాయి. ఆ విడాకులు రెండు కుటుంబాలను ఎంతో బాధపెడతాయి. దాని బదులు మీరు ప్రేమగా క్షమించమని అడిగితే ఆ బంధం ఇంకా పటిష్టంగా మారుతుంది. రెండు కుటుంబాల వారు సంతోషంగా జీవిస్తారు. కాబట్టి సారీ అనే పదాన్ని చెప్పడానికి ఎప్పుడు వెనుకాడకండి. తప్పు మీదే అయితే తప్పకుండా సారీ చెప్పి ఆ బంధాన్ని కాపాడుకోండి.

ఏ బంధంలో అయినా ఇద్దరం మధ్య ప్రేమ, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ రెండు లేకపోతే వారి మధ్య గొడవలే మొదలవుతాయి. సఖ్యత ఉండదు. అవమానాలు, తెగదెంపుల వరకు వెళ్తుంది. కాబట్టి ఏ బంధాన్నైనా మీరు కాపాడుకోవాలంటే వారితో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నించండి. వారి గురించి వేరే చోట ఎప్పుడూ మాట్లాడకండి. వారికి నచ్చిన విషయాలను నేరుగా వారికి చెప్పడానికి ప్రయత్నించండి. వారిని బాధ పెట్టకుండా ప్రతి అంశాన్ని వివరించడానికి ట్రై చేయండి.


మీరు తీసుకునే నిర్ణయాలు ఎదుటివారిని బాధ పెట్టకుండా చూసేలా ఆలోచించండి. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అది తెలియక జరిగిందని క్షమించమని అడగండి. క్షమాపణకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. మీరు రెండు అడుగులు వెనక్కి తగ్గి క్షమాపణ అడిగితే ఏ బంధమైనా కరిగిపోతుంది. కానీ పంతానికి పోతే ఎంతటి గట్టి అనుబంధమైన తెగిపోతుంది. కాబట్టి ఇగోకు ఎప్పుడూ వెళ్ళకండి, అహంకారం మనిషిని నాశనం చేస్తుంది.

బంధాన్ని నిర్మించడంలో ముందుకు సాగేలా  చేయడంలో కమ్యూనికేషన్ ప్రధానంగా అవసరం. కాబట్టి మీరు మీ జీవితంలో ఉన్న ఏ అనుబంధాన్ని కాపాడుకోవాలంటే కమ్యూనికేట్ చేయడం నేర్చుకోండి. అనుకోకుండా జరిగిన తప్పులను కూడా నేరుగా వారితోనే మాట్లాడండి. అంతేగాని ఎదుటివారు బాధపడినా పట్టించుకోకుండా మీ మటుకు మీరు జీవిస్తే అది మీ జీవితంలోని ఒక్కొక్క అనుబంధాన్ని బలహీనం చేస్తూ పోతుంది. మీ మనసులోని భావాలను, ఆలోచనలను ఎదుటివారికి క్లియర్ గా చెప్పండి.

జీవిత భాగస్వామే కాదు, మీ జీవితం ఆనందంగా ఉండాలంటే ప్రతి బంధం అవసరమే. వారితో అప్పుడప్పుడు వాకింగ్‌కు వెళ్లడం, కాఫీకి వెళ్ళడం వంటివి చేయండి. వారితో మంచి సమయాన్ని కాసేపైనా గడిపేందుకు ప్రయత్నించండి.

అనుబంధంలో నిజాయితీ ఎంతో ముఖ్యమైనది. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీ బంధాలు కూడా అంతే పటిష్టంగా మారుతాయి. నిజాయితీ లేని అనుబంధం నిలబడదు. అనుబంధం అంటే కంటికి కనిపించని ముడి. అది మనుషుల్ని కట్టిపడేస్తుంది. జీవితాంతం మనుషుల్లో ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేలా చేస్తుంది.

మీరు జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ఎంతగా కాపాడుకోవాలని కోరుకుంటారో అక్క చెల్లెల్లు, అన్నదమ్ములు బంధాన్ని కూడా అంతే నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రులు వయసు పెరిగే కొద్దీ పిల్లలు వారిని పట్టించుకోవడం మానేస్తారు. కానీ ఆ పేగు బంధాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది.

Related News

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Big Stories

×