BigTV English

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Lip Care Tips: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

Lip Care Tips: పెదవుల అందంగా ఉంటే మనం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాం. ఎరుపు రంగులో ఉండే పెదాలు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో వివిధ కారణాలు వల్ల చాలా మంది పెదవులు పాలిపోతున్నాయి. అంతేకాకుండా నల్లగా మారుతున్నాయి. ఇలా జీవం కోల్పోయిన పెదవులు ఉన్న వారిలో కొందరు మానసికంగా మదన పడుతుంటారు. అంతే కాకుండా పెదవులు ఎర్రగా మారడానికి వివిధ రకాల క్రీమ్స్ వాడుతుంటారు. కానీ డైలీ కొన్ని రకాల టిప్స్ పాలించడం వల్ల కొద్ది రోజుల్లోనే ఎరుపు రంగు పెదవులను సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ టిప్స్ తో ఎర్రటి పెదాలు:

తేనె, నిమ్మరసం:
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం, తేనెను సమపాళ్లలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు తగ్గిపోతుంది. అంతే కాకుండా పెదవులు ఎర్రగా కూడా మారతాయి. తరచుగా దీనిని వాడడం వల్ల పెదవులు మెరుస్తూ కనిపిస్తాయి.


దోసకాయ ముక్కలు:
దోసకాయలో ఉండే కొన్ని రకాల గుణాలు చర్మంపై ఉండే జిడ్డుతో పాటు పిగ్మంటేషన్‌ను తగ్గిస్తాయి. దోసకాయ ముక్కలను సన్నగా కట్ చేసుకుని పెదాలపై 10 నిమిషాల పాటు పెట్టుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే పెదాలు ఎర్రగా మారతాయి. అంతే కాకుండా మీ అందాన్ని మరింత పెంచుతాయి.

గులాబీ రేకుల పేస్ట్:
తాజా గులాబీ రేకులను తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిని పదాలపై అప్లై చేసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల పెదాల పైన నలుపు తగ్గుతుంది. అంతే కాకుండా అతి తక్కువ రోజుల్లోనే ఎర్రగా మారతాయి.

ఆలివ్ ఆయిల్, చక్కెర:
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని అందులో చక్కరను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెదాలపై మసాజ్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వల్ల పెదాలు ఎర్రగా మారి మెరుస్తూ కనిపిస్తాయి.

Also Read:  బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

అలోవెరా జెల్:
పెదాలు నల్లగా ఉన్నవారు కలబందను తరచుగా అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా డైలీ చేయడం వల్ల పదాలు పొడిబారకుండా ఉంటాయి. అంతే కాకుండా ఎర్రగా మారతాయి. రోజుకు రెండుసార్లు పెదాలకు అలోవెరా జెల్ అప్లై చేసుకోవడం వల్ల పెదాల రంగు ఎర్రగా మారుతుంది.

మరి కొన్ని టిప్స్..

బీట్ రూట్ రసాన్ని పెదాలపై అప్లై చేయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక చిటికెడు పసుపులో కొన్ని పాలను కలిపి పెదాలకు మసాజ్ చేయడం వల్ల ఎర్రగా మారతాయి. అలాగే పెదాలకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి.

గ్రీన్ టీ తాగిన తర్వాత చాలా మంది ఆ బ్యాగ్ లను పడేస్తూ ఉంటారు. అలా చేయడం కాకుండా గ్రీన్ టీ బ్యాగులతో పెదాలను ఎరుపు రంగులోకి మార్చుకోవచ్చు. దీనిని 5 నిమిషాల పాటు పెదాలపై ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలు తినడం వల్ల కూడా పెదాలు ఎర్రగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×