BigTV English

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Barley Water Benefits: బార్లీ వాటర్‌తో అనారోగ్య సమస్యలు దూరం !

Barley Water Benefits: బార్లీలో అనేక పోషకాలు ఉంటాయి. బార్లీ తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. బార్లీలో ఫైబర్, మాంగనీస్, యాంటీ ఆక్సిండెంట్లతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బార్లీ వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బార్లీతో తయారు చేసిన వాటర్ శరీరంలో వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తాయి. బార్లీ వాటర్ తాగడం వల్ల ఏఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం మెరుగుదల:


బార్లీలో బీటా- గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బీటా- గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది .అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని ఇది తప్పిస్తుంది. బార్లీ వాటర్ తాగే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 9 శాతం తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలు వెళ్లడయింది బార్లీ నీరు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అజీర్తి సమస్యలు దూరం:
జీర్ణ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్న వారు బార్లీ నీరు తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణాశయం కూడా వేగంగా క్లీన్ అవుతుంది. అంతేకాకుండా అజీర్తి కూడా దూరం అవుతుంది. బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కడుపులో మంట. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం మలబద్ధకం ఉన్నవారు కూడా బార్లీ వాటర్ తాగితే చాలా మంచిది. ఈ వాటర్ తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి.

డీహైడ్రేషన్ నివారణ:
బార్లీలో పొటాషియం మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. డీహైడ్రేషన్ సమయంలో ఈ ఎలక్ట్రోలైట్లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఈ క్రమంలోనే బార్లీ నీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్లు భర్తీ చేస్తాయి.

రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణ:

బార్లీలో వాటర్ రక్తంలోని చెక్కర స్థాయిలో నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని బీటా- గ్లూకాన్ రక్తప్రవాహంలో చక్కెర గ్రహించడాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, స్పైక్ లను నివారించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బరువు తగ్గడానికి:

ఆకలి నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడానికి బార్లీ నీరు ప్రేరేపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బార్లీ వాటర్ తీసుకున్నప్పుడు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఈ హార్మోన్లు జీవక్రియను పెంచుతాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తాయి.

Also Read: డయాబెటీస్ ఉన్నవారికి శనగప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

రోగనిరోధక శక్తి పెరుగుదల:
బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి కూడా రక్షిస్తాయి.

గర్భిణులకు మంచిది:
గర్భిణీలు రోజు బార్లీ వాటర్ తాగితే చాలా మంచిది. కాల్ల వాపు సమస్య కూడా దరిచేరదు. అలసట కూడా అనిపించదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బార్లు నీళ్లు తాగితే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఇన్ఫెక్షన్లు దూరం:
మూత్ర నాళ సమస్యల దూరం చేసుకోవాలంటే ప్రతి రోజు ఉదయం గ్లాసు బార్లీ నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మూత్రం ఇన్ఫెక్షన్లు రాకుండా ఇది నివారిస్తుంది. వ్యర్ధాలు కూడా బయటకు పోయేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×