BigTV English

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

Obesity Causes: బరువు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే !

Obesity Causes: ఊబకాయం అనేది ఈ రోజుల్లో చిన్న వయసులోనే కనిపించే పెద్ద సమస్య. శరీరంలో కొవ్వు పెరగడం శరీర ఆకృతిని పాడుచేయడమే కాకుండా, అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఊబకాయానికి ప్రధాన కారణాలు. కొన్నిసార్లు ఎక్కువగా మందులు వాడటం వల్ల కూడా పాటు మందుల వల్ల కూడా బరువు పెరగవచ్చు.


శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ నిరంతరం తీసుకోవడం వల్ల ఊబకాయం వేగంగా పెరుగుతుంది. శరీరంలో కొవ్వు పెరగడానికి గల 5 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఊబకాయం పెరగడానికి ప్రధాన కారణాలు..


1. అసమతుల్య ఆహారం..
జంక్ ఫుడ్: బర్గర్లు, పిజ్జా, చిప్స్, నూడుల్స్ మొదలైన వాటిలో కేలరీలు, కొవ్వు, ఉప్పు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఈజీగా బరువు పెరుగుతారు.

చక్కెర పానీయాలు: శీతల పానీయాలు, జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర ఉండటం వల్ల బరువు పెరుగుతుంది. అందుకే వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.

ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్యాక్ చేసిన ఆహారాలు తరచుగా తినడం వల్ల బరువు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఇతర హానికరమైన పదార్థాలను కలిగి ఉంటాయి.

2. శారీరక శ్రమ లేకపోవడం:
సిట్టింగ్ వర్క్: చాలా మంది రోజంతా కూర్చొని పని చేస్తారు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

వ్యాయామం చేయకపోవడం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

నిద్ర లేకపోవడం :తగినంత నిద్ర లేకపోవడం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. అంతే కాకుండా బరువు పెరగడానికి దారితీస్తుంది.

3. ఒత్తిడి:
ఒత్తిడి సమయంలో, ప్రజలు తరచుగా ఆహారం ఎక్కువగా తినడానికి మొగ్గు చూపుతారు. దీని వల్ల శరీరం బరువు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి

ఊబకాయాన్ని నివారించే మార్గాలు..

సమతుల్య ఆహారం తీసుకోండి: మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ప్రోటీన్లను చేర్చండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.

చక్కెర పానీయాలను నివారించండి: నీరు, పాలు లేదా పండ్ల రసాలను తాగండి.

తేలికపాటి భోజనం చేయండి: నిద్రవేళకు కనీసం 2-3 గంటల ముందు మీ భోజనం తినండి.

ఒత్తిడిని తగ్గించండి: యోగా, ధ్యానం లేదా ఇతర పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించండి.

వైద్యుడిని సంప్రదించండి: మీరు ఏదైనా మందులు వాడుతున్నట్లయితే కనక తప్పక , దాని దుష్ప్రభావాల గురించి వైద్యుడిని అడగండి.

Tags

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×