BigTV English

Telegram Messenger: ‘టెలిగ్రామ్’ అడ్డాగా అలాంటి పనులు.. అమెరికా వార్నింగ్, మరి ఇండియా?

Telegram Messenger: ‘టెలిగ్రామ్’ అడ్డాగా అలాంటి పనులు.. అమెరికా వార్నింగ్, మరి ఇండియా?

UN Report Says Telegram Is Facilitating Growth Of Illicit Underground  Markets:  ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ పై యునైటెడ్ నేషన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటాను దొంగిలించడం మొదలుకొని మనీ లాండరింగ్ వరకు క్రిమినల్ ముఠాలు టెలిగ్రామ్ ను వాడుకుంటున్నాయని హెచ్చరించింది.  UNODC తాజా నివేదికలో ఆగ్నేయాసియా, ముఖ్యంగా చైనీస్ సిండికేట్ల మోసపూరిత కార్యకలాపాలకు టెలిగ్రామ్ హాట్‌ స్పాట్‌ గా మారిందని వెల్లడించింది. ఈ యాప్ ద్వారా నేరస్తులు అత్యంత శక్తివంతమైన క్రైమ్ నెట్ వర్క్ గా ఏర్పడి పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది.


 లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో తీవ్ర మోసాలు

యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) విభాగం విడుదల చేసిన నివేదికలో టెలిగ్రామ్ ఛానెళ్లు ఎలా అక్రమ లావాదేవీలకు కేంద్రంగా మారాయో వివరించింది. క్రెడిట్ కార్డ్ వివరాలు, పాస్‌ వర్డులు, బ్రౌజర్ హిస్టరీలకు సంబంధించిన డేటాను దొంగిలించడానికి రూపొందించబడిన మాల్‌వేర్లు ఈ ప్లాట్‌ ఫారమ్‌ లో అమ్మకానికి దొరుకుతున్నట్లు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్ టెక్నాలజీతో పాటు లేటెస్ట్ ఫ్రాడ్ టూల్స్ ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.


టెలిగ్రామ్ ను కేంద్రంగా మార్చుకుని సౌత్ ఈస్ట్ ఆసియాలో పెద్ద క్రైమ్ నెట్ వర్క్ రన్ అవుతున్నట్లు వెల్లడించింది. విదేశాల నుంచి దొంగిలించబడిన 3 మిలియన్ల USDTని తరలిస్తున్నట్లు సైబర్ నేరస్తు టెలిగ్రామ్ లో చెప్పడం చూస్తుంటే, ఈ ఫ్లాట్ ఫారమ్ ద్వారా జరుగుతున్న అక్రమ నగదు ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని తెలిపింది.

టెలిగ్రామ్ వేదికగా ఏటా $27.4 నుంచి $36.5 బిలియన్ల ఆదాయం     

“సౌత్ ఈస్ట్ ఆసియాలో, ముఖ్యంగా చైనీస్ సిండికేటలు మోసపూరిత కార్యకలాపాలకు టెలిగ్రామ్  హాట్‌ స్పాట్‌ గా మారింది. ఈ నేరస్తుల గ్రూమ్ ఏటా $27.4 బిలియన్ల నుంచి $36.5 బిలియన్ల మధ్య ఆదాయాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీతో పాటు డార్క్ వెబ్‌ సాయడంతో యూజర్లను మోసం చేస్తూ అక్రమ మార్గాల ద్వారా నేరస్తులు డబ్బులు సంపాదిస్తున్నారు. తమ నేర ప్రపంచాన్ని రోజు రోజుకు  విస్తరిస్తున్నారు” అని UNODC నివేదిక వెల్లడించింది.

ఆగష్టులో టెలీగ్రామ్ అధినేత అరెస్ట్

నేర కార్యకలాపాలను సులభతరం చేయడం, పిల్లల లైంగిక వేధింపుల వీడియోలను సర్క్యులేట్ చేయడంతో పాటు పలు నేరాలకు బాధ్యుడిగా చేస్తూ రీసెంట్ గా టెలిగ్రామ్ అధినేత పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు. నేరాలకు అవకాశం కల్పించేలా ఆయన ఈ ఫ్లాట్ ఫారమ్ ను రూపొందించినట్లు అభియోగాలు మోపారు. అరెస్టు తర్వాత ఆయన తన ఫ్లాట్ ఫామ్ లో నేరాలను అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసులకు హామీ ఇచ్చారు. తాజాగా విడుదలైన UN నివేదికపై టెలిగ్రామ్ అధినేత నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

టెలిగ్రామ్ అత్యంత లోప భూయిష్టంగా ఉందని  UNODC అధికారులు వెల్లడించారు. ఈ ఫ్లాట్ ఫారమ్ లోని యూజర్ల డేటాను ఈజీగా కొల్లగొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు, మాల్వేర్, డీప్‌ ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ ఫ్లాట్ ఫారమ్ లో 10 కంటే ఎక్కువ డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ ప్రొవైడర్లను గురించినట్లు తెలిపారు.

అటు దక్షిణ కొరియాలో ఆన్‌లైన్ లైంగిక నేరాలను ప్రారంభించడంలో టెలిగ్రామ్ ప్రమేయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా డీప్‌ఫేక్ అశ్లీలతను విస్తృతంగా అందుబాటులోకి తెస్తున్నట్లు గుర్తించారు. తాజాగా భారత్ లో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థకు సంబంధించిన సున్నితమైన డేటాను లీక్ చేయడానికి ఒక హ్యాకర్ టెలిగ్రామ్‌ను ఉపయోగించడం సంచలనం కలిగించింది.

Read Also:  పులిపై సవారి.. ఏదో చేద్దాం అనుకున్నాడు, చివరికి..

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×