Hair Fall Reasons:చాలా మంది ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రాలుతున్న జుట్టుతో నానాపాట్లు పడుతున్నారు. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అవును అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? మహిళల్లో జుట్టు రాలడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ ఏ కారణాల వల్ల జుట్టు రాలుతుంది. అంతే కాకుండా ఈ సమస్యకు సంబంధించిన పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళల్లో జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. సాధారణంగా చలి లేదా వర్షం కారణంగా జుట్టు రాలిపోతుందని అనుకుంటారు. కానీ ఇవే ప్రధాన కారణాలు కావు. మహిళల్లో జుట్టు రాలడం వెనుక చాలా కారణాలు ఉంటాయి.
జన్యుపరమైన కారణాలు: ఇది చాలా సాధారణ కారణాలలో ఒకటి. జుట్టు క్రమంగా సన్నబడటం,నుదిటి వైపుల నుండి జుట్టు రాలుతుండటం.అనేది జన్యుపరమైన కారణాల వల్ల కూడా జరుగుతుంది.
హార్మోన్ల మార్పులు:
గర్భం, ప్రసవం- గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలడం సాధారణం. డెలివరీ తర్వాత కూడా ఈ సమస్య వస్తుంది.
మెనోపాజ్- మెనోపాజ్ సమయంలో, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల జుట్టు పలుచగా మారుతుంది.
థైరాయిడ్ సమస్యలు – హైపోథైరాయిడిజం , హైపర్ థైరాయిడిజం రెండూ జుట్టు రాలడానికి కారణమవుతాయి.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)- PCOSతో బాధపడుతున్న వారిలో హార్మోన్ల అసమతుల్యత వస్తుంది.ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది.
పోషకాహార లోపం:
ఐరన్ లోపం – రక్తహీనత జుట్టు రాలడానికి కారణమవుతుంది.
ప్రోటీన్ లోపం – జుట్టు పెరుగుదలకు ప్రోటీన్ అవసరం.
విటమిన్, మినరల్ లోపం- విటమిన్-డి, బి కాంప్లెక్స్ విటమిన్, జింక్ లోపం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది.
మందులు:
గర్భనిరోధక మాత్రలు- కొన్ని రకాల గర్భనిరోధక మాత్రలు జుట్టు రాలడానికి కారణమవుతాయి.
రక్తపోటు మందులు- కొన్ని రక్తపోటు మందులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.
క్యాన్సర్ చికిత్స- కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వల్ల కూడా జుట్టు రాలుతుంది.
టెన్షన్:
మానసిక ఒత్తిడి- దీర్ఘకాలిక ఒత్తిడి జుట్టు రాలేలా చేస్తుంది.
శారీరక అనారోగ్యం- తీవ్రమైన అనారోగ్యం, ఆపరేషన్స్ కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి.
ఇతర కారణాలు:
జుట్టు సంరక్షణ లోపం- ఎక్కువగా షాంపూ వాడటం, హీటింగ్ టూల్స్ ఎక్కువగా ఉపయోగించడం, హెయిర్ స్టైల్, కెమికల్ ట్రీట్ మెంట్లు కూడా జుట్టుకు హాని కలిగిస్తాయి.
చర్మ వ్యాధి- సోరియాసిస్, అలోపేసియా అరేటా వంటి చర్మ వ్యాధులు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.
Also Read: ఇంట్లోనే ఇలా హెయిర్ స్పా చేసుకుంటే.. జుట్టు రాలనే రాలదు
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఏం చేయాలి ?
ఆరోగ్యకరమైన ఆహారం-ప్రొటీన్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి.
ఒత్తిడి- యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలు చేయండి .
మంచి నిద్ర – 8-9 గంటలు నిద్రపోవాలి.
జుట్టు సంరక్షణ- హీటింగ్ టూల్స్ వాడకాన్ని తగ్గించండి. సహజ ఉత్పత్తులను ఉపయోగించండి.
వ్యాయామం- ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి.