Hair Spa: కాలుష్యం వల్ల మన జుట్టు పొడిబారి, నిర్జీవంగా, బలహీనంగా మారుతుంది. ఇలాంటి సమయంలో జుట్టు రాలకుండా ఉండేందుకు హెయిర్ స్పా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిసారీ పార్లర్‌కి వెళ్లి ఖరీదైన హెయిర్ స్పా చేయించుకోవడం అందరికీ వీలు కాదు. ఇది డబ్బుతో కూడుకుంది కూడా. ఇంట్లోనే సహజ పద్ధతిలో హెయిర్ స్పా చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే హెయిర్ స్పా ఎలా చేసుకోవాలి. హెయిర్ స్పా వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ స్పా చేసుకోవడం వల్ల జుట్టుకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా జుట్టు పెరుగుదల బాగుంటుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది. హెయిర్ స్పా తరుచుగా చేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా తయారవుతుంది.
ఇంట్లోనే హెయిర్ స్పా ఇలా చేయండి:
వేడి నూనెతో మసాజ్ :
ఎల్లప్పుడూ జుట్టు పోషణ నూనెతో ప్రారంభమవుతుంది. మీ జుట్టు మూలాలకు గోరువెచ్చని నూనెను రాయండి. కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని వేడి చేసి తలకు రాయడం వల్ల జుట్టు పెరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి ?
ఒక గిన్నెలో నూనె తీసుకుని కాస్త వేడి చేయాలి. ఇప్పుడు దీన్ని జుట్టు మూలాలకు బాగా పట్టించి వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి.
మసాజ్ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును బలంగా చేస్తుంది.
హెయిర్ మాస్క్:
హెయిర్ స్పా జుట్టుకు హెయిర్ మాస్క్ అవసరం. మీరు కొన్ని సహజ పదార్ధాలతో ఇంట్లోనే హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇది మీ జుట్టుకు పోషణనిస్తుంది.
గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్: గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా పెరుగు జుట్టును కండీషన్ చేస్తుంది. ఒక గుడ్డు, రెండు చెంచాల పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత కడిగేయాలి.
అలోవెరా జెల్, కొబ్బరి నూనె: కలబంద జుట్టుకు తేమను, పోషణను అందిస్తుంది. ఒక చెంచా అలోవెరా జెల్‌లో ఒక చెంచా కొబ్బరి నూనె మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. 20-30 నిమిషాల తర్వాత కడగాలి.
అరటిపండు, తేనె హెయిర్ మాస్క్: ఒక అరటిపండు, ఒక చెంచా తేనె మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
Also Read:చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?
ఆవిరి:
నూనె రాసుకున్న తర్వాత జుట్టుకు ఆవిరి పట్టడం చాలా ప్రయోజనకరం. నూనెలు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి. ఆవిరి పట్టడం కోసం టవల్‌ను వేడి నీటిలో నానబెట్టి, పిండేయండి. ఇప్పుడు ఈ టవల్‌ను జుట్టు మీద చుట్టి సుమారు 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇది నూనె మీ జుట్టులోకి లోతుగా చొచ్చుకుపోయేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తుంది.