Pushpa 2 item song: ఏ దర్శకుడైనా సరే ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని ఎంతో కష్టపడతారు. అయితే ఆ కష్టం ఒక్కొక్కసారి ఎంతలా ఉంటుంది అంటే నిద్రాహారాలు సైతం మానేసి అహర్నిశలు కష్టపడతారు. అయితే ఆ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఏదిఏమైనా తాను అనుకున్న ఫలితం వచ్చేవరకు డైరెక్టర్ లు కష్టపడడం మానరు. సరిగ్గా ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నారు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar). మిస్టర్ పర్ఫెక్ట్ అనే పేరు తెచ్చుకున్న ఈయన.. తాను తీసే ప్రతి సినిమాలో కూడా ప్రత్యేకమైన మార్క్ కచ్చితంగా చూపిస్తారు. ఇప్పటికే ఈయన దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’ , ‘పుష్ప ‘ వంటి సినిమాలు ఎంత విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నార్త్ ఆడియన్స్ టార్గెట్..
నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది అంటే, ఇక ప్రమోషన్స్ చేసి ఉండి ఉంటే ఆ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ను టార్గెట్ గా పెట్టుకున్న సుకుమార్.. పుష్ప సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పుష్ప – ది రూల్ ‘ అంటూ రాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడానికి చిత్ర బృందం ఎంతగానో శ్రమిస్తోంది.
రోజుకు అరగంట మాత్రమే నిద్ర..
ప్రత్యేకించి డైరెక్టర్ సుకుమార్ గత నెల రోజుల నుంచి ఒకవైపు చిత్రీకరణ, మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. దీంతో ఆయనకు సరైన నిద్ర కూడా ఉండడం లేదని, రోజుకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతున్నారని సమాచారం. పగలు చిత్రీకరణలో.. రాత్రి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటున్నారట. ఇకపోతే క్లైమాక్స్ సన్నివేశం ఇప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా రూపొందించబోతున్నట్లు తెలిసింది. మరోవైపు శ్రీ లీలాతో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే పుష్ప సినిమాలో ” ఊ అంటావా మావ” అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో అంతకుమించిన ఎనర్జీతో ఐటమ్ సాంగ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పుష్ప -3 కూడా..
చివరిలో పుష్ప -3 కూడా ఉండే అవకాశం ఉందని, ఇప్పటికే పలు రకాల హింట్స్ కూడా ఇచ్చారు. ఇక ఫహాద్ ఫాజిల్ కేవలం రెండో భాగానికి మాత్రమే పరిమితం కాడని.. మూడో భాగంలో కూడా ఆయన పాత్ర ఉండేలా సుకుమార్ కథ సిద్ధం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడానికి సుకుమార్ చాలా కష్టపడుతున్నారని చెప్పవచ్చు. మరి సుకుమార్ కష్టానికి ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఫలితం దక్కింది అని చెప్పడంలో సందేహం లేదు.ఇక ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు.