Big Stories

Treatment for Migraine: మైగ్రేన్ వేధిస్తోందా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!

Symptoms and Treatment for Migraine: ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని మైగ్రేన్ సమస్య వేధిస్తోంది. పురుషుల కంటే ఎక్కువగా మహిళలు మైగ్రేన్ బారిన పడుతున్నారు. మైగ్రేన్ అనేది సాధారణ నాడీ సంబంధిత రుగ్మత. దీని ద్వారా తలలో ఓ వైపు తీవ్రమైన నొప్పి, లైట్, సౌండ్ భరించలేకపోవడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కలుగుతాయి.

- Advertisement -

మైగ్రేన్ బాధితులు చిరాకు, అలసట, ఏకాగ్రత లేక ఇబ్బంది పడతారు. అయితే మైగ్రేన్‌తో బాదపడేవారిలో సగం మంది మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది డాక్టర్‌ను సంప్రదించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారట. తక్కువ మంది చికిత్సతో కోలుకుని మైగ్రేన్ నుంచి బయటపడుతున్నారు.

- Advertisement -

తలనొప్పి గురించి మహిళలు ఇంట్లో వారికి కంప్లైంట్ చేస్తే చాలా మంది నమ్మరు. సక్రమంగా పనిచేయలేని వారిగా సోమరితనం ఉన్నవారిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నిజంగానే వారికి వైద్యపరమైన సమస్యలు ఉన్నట్లు తెలుసుకోరు.పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా తరచూ తలనొప్పితో బాధపడేవారు డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ఎందుకంటే మైగ్రేన్ కు ప్రత్యేక చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్లు మాత్రమే దాన్ని సూచించగలుగుతారు.

మైగ్రేన్ ప్రభావాలు:

మైగ్రేన్ వచ్చే సమయంలో విసుగు, వికారం అనిపిస్తుంది. లైట్, సౌండ్ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. అంతే కాకుండా ఏ పని చేయకపోయినా అలసిపోయినట్లు అనిపించవచ్చు. వీరు స్పష్టంగా
ఆలోచించలేకపోతారు. వీరి చర్మం కూడా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మొదట్లోనే సరైన చికిత్స తీసుకోకపోతే ఇది కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ లేనప్పటికీ బ్రెయిన్ ఫాగ్, చర్మం నొప్పి లేదా లైట్ ని భరించలేకపోవడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.

మైగ్రేన్ సమయంలో సాధారణ పనులు కూడా చేసుకోలేరు. అందుకే మైగ్రేన్ సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలను డాక్టర్లకు తెలియజేయాలి. కంప్యూటర్ స్క్రీన్ ,ఫోన్ లైట్ ఇబ్బందిగా ఉంటుందా.. ప్రకాశవంతమైన ఆఫీస్ లో కూడా ఉండడం సమస్యగా ఉందా.. డిప్రెషన్ ఆందోళన లక్షణాలు ఉన్నాయా ..వంటి అంశాలను చెక్ చేసుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

Also Read: టెక్ నెక్ (మెడ నొప్పి)కి వ్యాయామం పనిచేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

మైగ్రేన్ గురించి డాక్టర్లతో మాట్లాడేటప్పుడు మైగ్రేన్ సమస్య ఏ విధంగా తమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందో ప్రతీది చెప్పడం ఎంతో ముఖ్యం. కేవలం తలనొప్పి అని చెప్పడానికి బదులుగా ఎన్ని గంటలు తలనొప్పి ఉంటుందో ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారో వివరించాలి .నొప్పి భరించలేకపోతున్నాను రోజువారి పనులు చేసుకోలేకపోతున్నాను వంటి మాటలను డాక్టర్‌కు చెప్పండి. ఇలాంటి మాటల ద్వారా వారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా దానికి సరైన చికిత్సను వారు మీకు అందిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News