BigTV English

Rs 2.5 Lakhs Discounts on Skoda Cars: డిస్కౌంట్ల జాతర.. స్కోడా కార్లపై రూ.2.5 లక్షల వరకు భారీ తగ్గింపు.. ఎప్పటి వరకు అంటే?

Rs 2.5 Lakhs Discounts on Skoda Cars: డిస్కౌంట్ల జాతర.. స్కోడా కార్లపై రూ.2.5 లక్షల వరకు భారీ తగ్గింపు.. ఎప్పటి వరకు అంటే?

Rs 2.5 Lakhs Discounts on Skoda Cars in May 2024: కొత్త ఏడాది 2025 ప్రారంభం నుంచి కూడా పలు కంపెనీలు తమ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి. టాటా, మహీంద్రా, కియా, హోండా, హ్యుందాయ్ వంటి బడా బడా కంపెనీలు తమ కార్లపై ఊహించని డిస్కౌంట్‌లను అందించి వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మరొక కంపెనీ తమ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.


చెక్ రికబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. అందులో కుషాక్, స్లావియా వంటి మోడళ్లపై కనీ వినీ ఎరుగని డిస్కౌంట్‌లను అందిస్తుంది. అయితే ఈ స్కోడా సంస్థ అందిస్తున్న డిస్కౌంట్లలో నగదు డిస్కౌంట్‌లు మాత్రమే కాకుండా.. కాంప్లిమెంటరీ 3 సంత్సరాలు లేదా 45000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ ప్యాకేజీ అందిస్తుంది. అలాగే ఎక్సెటెండెడ్ వారంటీ కూడా 5 ఏళ్లు లేదా 1.25 లక్షల కి.మీ వరకు అందిస్తుంది. ఇప్పుడు కుషాక్, స్లావియా మోడళ్లపై అందుబాటులో ఉన్న కార్ల గురించి తెలుసుకుందాం.

స్కోడా కుషాక్


భారతదేశంలో స్కోడా కంపెనీకి మంచి ప్రజాదరణ ఉంది. ఈ కంపెనీ కార్లకి డిమాండ్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. అందులో స్కోడా కుషాక్ మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు ఈ కారు కొనుగోలుపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఎస్యూవీ ధర రూ.11.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిపై కంపెనీ మే నెలలో రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో కస్టమర్లు మరింత తక్కువకే కారును కొనుగోలు చేయవచ్చు.

Also Read: సేఫ్టీ పరంగా ఈ కార్లకు తిరుగు లేదు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

ఈ స్కోడా కుషాక్ నాలుగు పవర్‌ట్రైన్ ఎంపికలతో అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన డిజైన్, లుక్‌తో వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. ఇవి రెండూ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ కేవలం ఈ నెల (మే 2024) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

స్కోడా స్లావియా

స్కోడా కంపెనీ తన మోడల్‌లోని స్కోడా స్లావియాపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ కారు ధర రూ.11.63 లక్షల నుంచి రూ.19.12 లక్షల మధ్య ఉంది. అయితే ఇప్పుడు దీనిపై కంపెనీ రూ.1.5 లక్షల వరకు భారీ తగ్గింపులను అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఈ నెల (మే 2024) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అయితే కస్టమర్లు ఇక్కడ కొన్నింటిని గమనించాలి. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల వరకు మాత్రమే ఉండనున్నాయి. వీటి డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరొక నగరానికి మారుతూ ఉండవచ్చు. అలాగే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్లు లభిస్తాయి.

Tags

Related News

అమెరికా నుంచి మీ పిల్లలు డబ్బులు పంపుతున్నారా..అయితే ఈ ఐటీ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

బంగారం vs రియల్ ఎస్టేట్: భూమిపై పెట్టుబడి పెడితే లాభమా…బంగారం కొంటే లాభమా..?

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

Amazon Appstore: అమెజాన్ యాప్‌స్టోర్‌కు గుడ్‌బై.. ఇకపై శాశ్వతంగా మూత.. డేట్ కూడా ఫిక్స్!

BSNL Offers: BSNL రూబీ ప్లాన్ విడుదల, జియో, ఎయిర్ టెల్ కు దబిడి దిబిడే!

Big Stories

×