BigTV English

IPL Franchises Involvement: ఫ్రాంచైజీల ఓవరాక్షన్.. అంత అవసరమా..?

IPL Franchises Involvement: ఫ్రాంచైజీల ఓవరాక్షన్.. అంత అవసరమా..?

IPL Franchises Involvement in Matches: కేల్ రాహుల్- లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గోయెంకా మధ్య వివాదం నెట్టింట పెనుదుమారాన్నే రేపింది. అయితే తను పార్టీకి పిలిచి రాహుల్ ని గౌరవించినా, ఈసారి 2024 సీజన్ లో మాత్రం, చాలా విపరీతాలకు దారి తీసింది. ఒకసారి అవన్నీ చూస్తే.. ముందుగా ముంబై ఫ్రాంచైజీ యజమాని ముఖేష్ అంబానీ గ్రూప్ చేసిన పెంట అంతా ఇంతా కాదు.


ఆల్ ఆఫ్ ది సడన్ గా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకొచ్చి, ముంబై జట్టు నెత్తిమీద పెట్టారు. అంతవరకు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను కాదని ఇలా చేశారు. అంతేకాదు రోహిత్ టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్నాడు. తనేమీ జట్టు ఆటగాడు కూడా కాదు. భారతదేశంలో, అదీ క్రికెట్ ని అమితంగా ప్రేమించే దేశంలో ఒక జాతీయ జట్టు కెప్టెన్ కి, ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చే గౌరవాన్ని చూసి దేశమే కాదు, క్రికెట్ ఆడే ప్రపంచ దేశాలు నివ్వెరబోయాయి. ఆ తర్వాత రోహిత్ అభిమానులు మామాలుగా ఏసుకోలేదు. మొత్తం ముంబై ఇండియన్స్ పరువు మంటకలిసిపోయింది.

ఇది ఒక ఎపిసోడ్ అయితే, మరొకటి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని అభిమానుల సమక్షంలో ఆ ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గోయెంకా స్టేడియంలోకి వెళ్లి, నానా మాటలు అనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ దెబ్బతో కేఎల్ రాహుల్ జట్టు నుంచి వైదొలిగేందుకు రెడీ అయిపోయాడనే వార్తలు వినిపించాయి. తర్వాత ఫ్రాంచైజీ ఓనర్ పిలిచి పార్టీ ఇచ్చినా, అదంత సత్ఫలితం ఇచ్చినట్టు అనిపించలేదు.


Also Read: Rohit Sharma : నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను: కెప్టెన్ రోహిత్ శర్మ

మూడో సంఘటన ఏమిటంటే.. ఢిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్త్ జిందాల్ చేసిన నిర్వాకం నెట్టింట సెగలు పుట్టించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ అవుట్ అయిన తీరు వివాదాస్పదమైంది. తను కొట్టిన బంతిని లాంగ్ ఆన్ లో గాలిలోకి ఎగిరి హోప్ క్యాచ్ అందుకున్నాడు. అది కాలు బౌండరీకి తాకినాట్టుగా రీప్లేలో కనిపించింది. అయినా సరే థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో సంజూకి కోపం వచ్చి అంపైర్ తో గొడవ పెట్టుకున్నాడు.

ఈ గొడవ జరుగుతుండగా ఢిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్త్ జిందాల్.. చేసిన ఓవర్ యాక్షన్ వెగటు పుట్టించింది. సంజూ సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు అవుట్ హోయ్.. నువ్వు అవుట్ హొయ్ అంటూ ప్రెస్ చేసి చెప్పడం తీవ్ర వివాదస్పదమైంది.

Also Read: SRH vs GT Match Today : గుజరాత్ కి చెలగాటం… హైదరాబాద్ కి ప్రాణ సంకటం

అయితే అందరూ ఇలాగే ఉండటం లేదు. కొందరైతే బయటకే కనిపించడం లేదు. వచ్చినా.. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వెళ్లిపోతున్నారు. ఇక కూల్ గా , ఒక జెంటిల్మేన్ గా ఉన్నవారిలో కోల్ కతా ఫ్రాంచైజీ ఓనర్ షారూఖ్ ఖాన్ ని నెంబర్ వన్ అంటున్నారు.

ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కతా మ్యాచ్ జరిగినప్పుడు జోస్ బట్లర్ అద్భుత సెంచరీతో రాజస్థాన్ ని గెలిపించాడు. అతను ప్రత్యర్థి ఆటగాడైనా సరే, షారూఖ్ వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఆ ఘటనతో నెట్టింట బాలీవుడ్ బాద్ షాని అభినందనలతో ముంచెత్తారు.

Also Read: Sanjiv Goenka KL Rahul Controversy: అది మా మధ్య టీ కప్పులో తుఫాను లాంటిది..

వీరుకాకుండా ఫ్రాంచైజీ ఓనర్లలో మహిళలు ఉన్నారు. వీరు కూడా తమ హావభావాలతో సందడి సందడి చేస్తున్నారు. అందులో ప్రధానంగా హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అధినేత కావ్య మారన్ చేసే హంగామా మామూలుగా లేదు. అలాగే పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఓవనర్ ప్రీతి జింతా హంగామా కూడా అంతా ఇంతా కాదు. వీరు మ్యాచ్ లను కళకళలాడిస్తున్నారు.

మొత్తానికి క్రికెట్ ని ఇలా ప్రైవేటు పరం చేసి, ఫ్రాంచైజీ ఓనర్లు జాతీయ స్థాయి ఆటగాళ్లపై పెత్తనం చేయడాన్ని కంట్రోల్ చేయకపోతే రాబోవు రోజుల్లో బీసీసీఐకి తీవ్ర నష్టం జరుగుతుంది. అంతేకాదు భారత క్రికెట్ కి మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags

Related News

Billy Bowden : అంపైర్ బిల్లీ బౌడెన్ వేళ్లు ఎప్పుడు ఎందుకు అలా వంకరగా ఉంటాయి.. అంత ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతున్నాడా?

Watch Video: ఆ గుండె బతకాలి రా.. రనౌట్ కు ఛాన్స్ ఉన్నా కొట్టలేదు… వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే

Asia Cup 2025: పాకిస్థాన్ ను చావు దెబ్బ కొట్టేందుకు రంగంలోకి ఆర్మీ ఆఫీసర్… !

Asia Cup 2025: టీమిండియాలోకి 14 ఏళ్ల వైభవ్, సాయి సుదర్శన్.. మంగళవారం 1:30 గంటలకు గెట్ రెడీ ?

Tilak Varma : గిల్ కోసం బలి పశువు అవుతున్న నెంబర్ 2లో తిలక్ వర్మ.. ఏంట్రా ఈ రాజకీయాలు అంటూ గంభీర్ పై ఫైర్

Asia Cup 2025: దరిద్రం అంటే ఇదే.. ఆసియా కప్ 2025 లో ఈ తోపు క్రికెటర్లను మిస్ కాబోతున్నాం

Big Stories

×