Onion Juice For Hair: ఉల్లిపాయ రసం జుట్టుకు అనేక రకాలుగా మేలు చేస్తుందని మీరు చాలాసార్లు వినే ఉంటారు. దీన్ని ఉపయోగించడం వల్ల చలికాలంలో హెయిర్ ఫాల్‌ను నియంత్రించవచ్చని మీకు తెలుసా ? అవును మీరు విన్నది నిజమే జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉల్లి రసం చాలా బాగా ఉపయోగపడుతుంది.
నిజానికి, ఉల్లిపాయ రసం జుట్టులో ఉండే ఫంగస్, బ్యాక్టీరియాను చంపే కొన్ని మూలకాలను కలిగి ఉంటుంది. ఇది మన జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించి కాసేపు మసాజ్ చేస్తే తలలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది మన జుట్టును పోషిస్తుంది. అంతే కాకుండా మూలాల నుండి బలపరుస్తుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని జుట్టుకు ఎలా ఉపయోగించాలనే విషయం గురించి చాలా మందికి తెలియదు. ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా ఉల్లిపాయ రసం జుట్టును బలపరుస్తుంది. రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడమే కాకుండా జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.
ఉల్లిపాయ రసం, తేనె:
తేనెలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జుట్టు పాడవకుండా కాపాడతాయి. ఉల్లిపాయ రసంలో మిక్స్ చేసి తేనెను జుట్టు , తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది. తేనె జుట్టుకు పోషణను ఇస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు రాలకుండా చేస్తుంది.
ఉల్లిపాయ రసం,పెరుగు:
పెరుగులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి. ఉల్లిపాయ రసంలో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకు దూరమవుతుంది. అంతే కాకుండా పెరుగులోని పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తాయి.
ఉల్లిపాయ రసం, ఎగ్:
కోడిగుడ్లలో బయోటిన్ ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయ రసంలో మిక్స్ చేసి ఎగ్ జుట్టుకు అప్లై చేయడం వల్ల పెరుగుదల రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా మీ జుట్టును సహజంగా సిల్కీగా మార్చుకోవచ్చు. ఎగ్ లోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి . అంతే కాకుండా జుట్టుకు పోషణను అందిస్తాయి.
Also Read: పొడవాటి జుట్టు కోసం.. ఇలా చేయండి
ఉల్లిపాయ రసం , అలోవెరా:
కలబంద జుట్టును ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును కూడా నివారిస్తుంది. ఉల్లిపాయ రసంలో అలోవెరా మిక్స్ చేసి జుట్టుకు రాసుకుంటే చుండ్రు చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇది జుట్టు మునుపటి కంటే ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు నిగనిగలాడేలా చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.