BigTV English

Raw Mango Health Benefits: పచ్చి మామిడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Raw Mango Health Benefits: పచ్చి మామిడికాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

mangoRaw Mango Health Benefits: వేసవికాలం వచ్చిందంటే చాలు మాడిమి పండ్లు సీజన్ మొదలవుతుంది. అందుకే వేసవిలో ఇవి చాలా ఫేమస్. అయితే చాలా మంది వీటిని పచ్చిగా ఉన్నప్పుడు తినడానికి ఇష్ట పడతారు. మరికొందరు అవి పండిన తర్వాత తింటారు. అయితే మామిడి పండక ముందు కాయగా ఉన్నప్పుడు తింటే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!


మామిడి పండను అన్ని పండ్లలో రారాజు అంటారు. ఎందుకంటే దాన్ని పచ్చిగా తిన్నా, పండిన తర్వాత తిన్నా సరే చాలా విటమిన్లు, పోషకాలు ఉంటాయి. వీటి పరంగానే కాకుండా వేసవి కాలంలో మాత్రమే లభించడంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మామిడి పండు అంటే పడిచచ్చి పోతారు. త్వరలోనే రాబోయే తెలుగు కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మామిడి పండ్లు మార్కెట్ లోకి వస్తాయి. అయితే కొందరు మాత్రం ఉగాది కంటే ముందే మామిడి పండ్లు కాకుండా కాయలను రుచి చూస్తుంటారు. మరి కొందరు మామిడి కాయలను పచ్చడి చేసుకుని సంవత్సరం పొడువునా నిల్వ ఉంచుకుంటారు. మరికొందరు అయితే పచ్చి కాయలను కోసి వాటిపైన ఉప్పు, కారం వేసుకుని లాగించేస్తుంటారు. అయితే పచ్చి మామిడిని తినడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడి కాయను తింటే అందులో ఉండే విటమిన్ ఇ, సి, యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా ఇవి మన శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
పచ్చి మామిడిలో ఐరన్ అధిక మొత్తంలో ఉండడం వల్ల రక్త హీనతతో బాధ పడుతున్న వారి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో మాత్రమే లభించే పచ్చి మామిడి కాయను తీసుకుంటే అందులో ఉండే బోలెడన్ని ఫైబర్స్ మన శరీరానికి లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీని వల్ల మలబద్దక సమస్య చాలా వరకు తగ్గుతుంది. అజీర్ణం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.


Also Read: Summer Watermelon Buying Tips: పుచ్చకాయ కొనేటప్పుడు ఆరు నూరైన ఈ గుర్తులు మర్చిపోకండి!

మామిడిలో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి కారణంగా చర్మం ముడతలు పడకుండా, మొటిమలు రాకుండా, కాంతవంతంగా ఉంటేటట్లు చేస్తుంది.
పచ్చి మామిడిలో ఉన్నటువంటి ఫైబర్లు మన రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉండే విధంగా చేస్తాయి. అందుచేతనే ముధుమేహం ఉన్నవారు కూడా మామిడి కాయలు తినవచ్చిని వైద్యులు సూచిస్తుంటారు.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×