BigTV English

CWC Meeting in Delhi: ముగిసిన సీడబ్ల్యూసీ భేటి.. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఫిక్స్!

CWC Meeting in Delhi: ముగిసిన సీడబ్ల్యూసీ భేటి.. తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులు ఫిక్స్!

Lok Sabha Elections 2024


CWC special meeting in Delhi(Today news paper telugu): ఢిల్లీలో CWC ప్రత్యేక సమావేశం ముగిసింది. AICC కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోకు కాంగ్రెస్‌ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తమ హామీలను ప్రజలముందు ఉంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించేందుకు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం పెంపు, నిరుద్యోగులకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించడం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలో ఒక మహిళలకు సంవత్సరానికి రూ. లక్షసాయం, 30 ఏళ్ల లోపు యువత స్టార్టప్ లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ వంటి హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు తీసుకున్న చర్యలు గురించి చర్చించనట్లు తెలుస్తోంది.


Also Read: బీహార్‌లో కుదిరిన ఒప్పందం.. బీజేపీ, జేడీయూ మధ్య ఎంపీ సీట్ల పంపకాలు ఇలా..

లోక్ సభ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల మూడో జాబితాను ప్రకటించేందుకు గాను సీఈసీ సమావేశమైంది. అయితే ఈ సమావేశంలో తెలంగాణలో నాలుగురు లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి డాక్టర్ సుమలత, మల్కాజిగిరి నుంచి పట్నం సునితా రెడ్డి, చేవెళ్ల నుంచి రంజీత్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లురవిని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. మిగిలిన 9 స్థానాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు అధిష్టానం తెలిపింది. దీంతో పాటుగా మరి కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులు కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో 82 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

MLAs Free iPhones: ఎమ్మెల్యేలకు ఉచితంగా ఐఫోన్లు.. రాజకీయ రచ్చ, ఎక్కడంటే

Poonch sector firing: కాల్పులకు తెగబడ్డ పాక్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సైన్యం!

Dharali floods: 11 మంది జవాన్లు గల్లంతు.. మరో నలుగురు మృతి.. అక్కడ ఊరుఊరంతా..?

Big Stories

×