BigTV English

Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌ బుధవారం ప్రమాణ స్వీకారం..

Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్‌ బుధవారం ప్రమాణ స్వీకారం..

Telangana New Governor CP Radhakrishnan


Telangana New Governor CP Radhakrishnan(Latest news in telangana): తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆమె రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకే తమిళిసై తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో తెలంగాణకు కొత్త గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. ఈయన బుధవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీపీ రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

తమిళిసై సౌందర రాజన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించారు. ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.


Also Read : ప్రజావాణి తాత్కాలిక రద్దు.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సీపీ రాధాకృష్ణన్ 2023లో ఝార్ఖండ్ 10వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో ఉన్న ఆయన రెండు సార్లు కోయంబత్తూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998 కోయంబత్తూర్ బాంబు దాడుల తర్వాత, 1999 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2004, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ కోయంబత్తూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతేడాది ఝార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి 2019 వరకూ ఆల్ ఇండియా కాయిర్ బోర్డుకు ఛైర్మన్ గా పనిచేశారు.

 

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×