BigTV English

Red Aloe Vera: చందమామ లాంటి ముఖం కోసం.. దీన్ని ఒక్క సారి వాడండి

Red Aloe Vera: చందమామ లాంటి ముఖం కోసం.. దీన్ని ఒక్క సారి వాడండి

Red Aloe Vera: కలబంద మొక్క దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటుంది. ఇది చాలా ప్రయోజనాలను కలిగి ఉంది. సాధారణంగా మీరు ఆకుపచ్చ కలబంద గురించి వినే ఉంటారు . కానీ మేము మీకు రెడ్ కలబంద గురించి అంతగా ఎవరికీ తెలియదు. కానీ ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


అలోవెరా అనే పేరు వచ్చినప్పుడల్లా అందరిలో మొదటి ఆలోచన వచ్చేది అందమే. చర్మం, ఆరోగ్యం , జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలను దూరం చేసే మొక్క ఇది. ఆకుపచ్చ కలబంద మాత్రమే కాదు కలబంద ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ఆకుపచ్చ కలబంద కంటే ఎక్కువ ప్రయోజనకరమైంది. ఎర్ర కలబందను ‘కుమారి’ అని కూడా అంటారు.

రెడ్ కలబందలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ,మినరల్స్ పుష్కంగా ఉంటాయి. ఇది చర్మ సంరక్షణకు ఇది సహజమైన పరిష్కారం. అంతే కాకుండా ఇది మీ చర్మానికి సహజమైన మెరుపును అందించడంతో పాటు అనేక సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రెడ్ కలర్ కలబంద గురించిని పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


చర్మానికి తేమను అందిస్తాయి:
ఎరుపు కలబందలో నీరు సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం చాలా కాలం పాటు హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డ్రై , డల్ స్కిన్ ను మృదువుగా , మెరిసేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

నల్ల మచ్చలను తొలగిస్తుంది:
ఎరుపు రంగు కలబంద చర్మంలోని నల్ల మచ్చలు , పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి ఒక మంచి మార్గం . కలబంద గుజ్జును రోజు ముఖానికి రాసుకుంటే చర్మం రంగు ఏకరీతిగా మారి మచ్చలు తొలగిపోతాయి.

ముడతలను తొలగిస్తాయి:
ఎరుపు కలబందలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మం ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడతాయి . అదనంగా, ఇది చర్మం యొక్క స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. దీంతో మీ ముఖం పూర్తిగా తాజాగా కనిపిస్తుంది.

వడదెబ్బ నుండి ఉపశమనం:
ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. ఇది వడదెబ్బ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేర్ చేసి ఆరోగ్యవంతంగా చేస్తుంది.

ఎర్రటి కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది వాపు, దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా వాడాలి. చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.

గాయాలను త్వరగా నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెడ్ కలబందలో యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంపై ఏవైనా గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా.. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి మన చర్మాన్ని కూడా రక్షిస్తుంది.

Also Read: చలికాలంలో రాత్రి పూట బెల్లం పాలు త్రాగితే.. మతిపోయే లాభాలు

ఎరుపు రంగు కలబందను ఇలా ఉపయోగించండి:
ఫేస్ ప్యాక్
చర్మం మాయిశ్చరైజర్
స్క్రబ్ గా

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

ఎరుపు కలబందను ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.

స్వచ్ఛమైన కలబందను మాత్రమే ఉపయోగించండి.

చికాకు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Related News

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Big Stories

×