BigTV English

Rice Flour For Skin: బియ్యం పిండితో ఫేస్ ప్యాక్.. క్షణాల్లోనే నిగనిగలాడే చర్మం

Rice Flour For Skin: బియ్యం పిండితో ఫేస్ ప్యాక్.. క్షణాల్లోనే నిగనిగలాడే చర్మం

Rice Flour For Skin: అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. గ్లోయింగ్ స్కిన్ కోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా ఉంటారు. ఇంకొందరు మార్కెట్‌‌లో దొరికే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ట్రై చేస్తారు.


కానీ మార్కెట్‌లో లభించే ప్రొడక్ట్స్ కాకుండా ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో కూడా మీ ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు. బియ్యం పిండి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలోని లక్షణాలు కాంతివంతమైన చర్మం కోసం దోహదపడతాయి.

బియ్యం పిండితో తయారు చేసిన ఇన్‌స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం వల్ల 10 నిమిషాల్లో మీ ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. వంట గదిలోనే కాదు అందాల ప్రపంచంలో కూడా బియ్యం పిండికి ప్రత్యేక స్థానం ఉంది.


పురాతన కాలం నుండి బియ్యం చర్మానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. నేటికీ అనేక సౌందర్య ఉత్పత్తులలో కూడా దీనిని ఉపయోగిస్తారు. బియ్యప్పిండిలో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

తక్షణ మెరుపు కోసం బియ్యం పిండిని ఎందుకు వాడాలి ?

నేచురల్ ఎక్స్‌ఫోలియంట్- బియ్యం పిండిలో ఉండే కణాలు మృత చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటు మెరిసేలా చేస్తాయి.
చర్మాన్ని మృదువుగా చేస్తుంది- బియ్యపు పిండి చర్మాన్ని ఉపశమనం చేస్తుంది. అంతే కాకుండా చికాకును తగ్గిస్తుంది.
ఛాయను మెరుగుపరుస్తుంది- బియ్యం పిండి చర్మం యొక్క రంగును మెరుగుపరుస్తుంది. రంగు మారిన చర్మానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
నూనెను నియంత్రిస్తుంది – ఇది జిడ్డుగల చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మం నుండి అదనపు నూనెను గ్రహిస్తుంది.
యాంటీ ఏజింగ్ లక్షణాలు- బియ్యం పిండిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఫలితంగా ఇది ముడతలు, ఫైన్ లైన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
బియ్యపు పిండి, పెరుగు- బియ్యపు పిండి, పెరుగు రెండూ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, 2 చెంచాల బియ్యం పిండితో పాటు 2 చెంచాల పెరుగును ఒక బౌల్‌లో వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి , తేనె- తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులను నివారిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 చెంచాల బియ్యం పిండి , 1 చెంచా తేనెలను ఒక బౌల్ లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి, టమాటో- టమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది . ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి 2 చెంచాల బియ్యప్పిండిలో 1 చెంచా టమోటా గుజ్జు వేసి కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి ,ముల్తానీ మిట్టి – ముల్తానీ మిట్టి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా అదనపు నూనెను గ్రహిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి 2 చెంచాల బియ్యప్పిండి, 1 చెంచా ముల్తానీ మిట్టిని నీళ్లతో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి, శనగపిండి- శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి మృదువుగా చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, 2 చెంచాల బియ్యప్పిండితో పాటు 2 చెంచాల శనగపిండిని నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

బియ్యం పిండి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ?
ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.
సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖంపై పలుచని పొరలా అప్లై చేయాలి.
15-20 నిమిషాలు పొడిగా ఉండనివ్వండి.
తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
అనంతరం మాయిశ్చరైజర్ అప్లై చేయండి.

Also Read: బట్టతలపై కూడా జుట్టు రావాలంటే.. ఇలా చేయండి !

ఈ విషయాలను గుర్తుంచుకోండి:
బియ్యం పిండి ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి.
మీకు ఏదైనా అలెర్జీలు ఉంటే, దానిని ఉపయోగించకండి.
కళ్ల చుట్టూ ఫేస్ ప్యాక్ వేయకూడదు.

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×